అలాంటి జబ్బుతో బాధపడుతున్న స్టార్ హీరో భార్య.. కన్నీళ్లు పెట్టుకుంటున్న ఫ్యాన్స్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ రకరకాల వ్యాధులకు గురవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఎప్పుడైతే హీరోయిన్ సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురైందో అప్పటినుంచి సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీస్ జబ్బులకు సంబంధించిన డీటెయిల్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. రీసెంట్గా బాలీవుడ్ స్టార్ నటుడు ఆయుష్మాన్ ఖురానా తన భార్య తాహిరా పై పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది.

బాలీవుడ్ ఇండస్ట్రీలోనే వీళ్ళు ఒక స్టార్ కపుల్ . సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటారు . వీళ్లకు పెళ్లయి దాదాపు 15 ఏళ్లవుతుంది . ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయుష్మాన్ కురానా.. తన భార్య వెరైటీ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లకు షాక్ ఇచ్చారు . తాహిరా వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే . 2019లో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది. బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు స్వయంగా ప్రకటించింది . ఆ తర్వాత పలు రకాల ట్రీట్మెంట్స్ తీసుకునింది .

రీసెంట్గా తాహిరా క్యాన్సర్ ను జయించింది అంటూ ప్రకటించాడు ఆమె భర్త . నిన్న క్యాన్సర్ డే సందర్భంగా రేర్ పిక్స్ షేర్ చేశారు . ఎటువంటి టాప్ వేసుకోకుండా తాహీర ఉన్న బ్యాక్ సైడ్ ఫొటోస్ షేర్ చేస్తూ “నేను పంజాబ్ విశ్వవిద్యాలయంలో సమోసాలు తినడం.. టీ తాగడం చూసిన అమ్మాయిని ప్రేమిస్తున్నాను” అంటూ చాలా ఎమోషనల్ గా ప్రేమతో పోస్ట్ చేశారు . దీంతో అభిమానులు తాహిరాను ప్రశంసిస్తున్నారు . అలాగే ఆయుష్మాన్ ఖురాన్ ని కూడా ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . కొంతమంది ఫ్యాన్స్ తాహిరాకు క్యాన్సర్ అని తెలియగానే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్లంతా చాలా సంతోషంగా ఆమెను అప్రిషియేట్ చేస్తున్నారు..!!