“మనం కలిసి ఏడేళ్లు అవుతుంది రా”.. ఒక్క పోస్ట్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న కీర్తి సురేష్..!!

కీర్తి సురేష్ .. సినీ ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్లు ఉన్నా కూడా.. ఈ పేరు చెప్పగానే అందరికీ స్పెషల్ ఫీలింగ్ కలుగుతుంది. మరీ ముఖ్యంగా కీర్తి సురేష్ అనగానే మహానటి సినిమా గుర్తొస్తుంది . ఒకప్పటి జనాలకు మహానటి సావిత్రి గారు గుర్తొస్తే ఇప్పటి జనాలకు కీర్తి సురేషే గుర్తొస్తుంది. అంతలా తన అందంతో నటనతో ఆకట్టుకుంటుంది కీర్తి సురేష్ . ఆమె ఖాతాలో మహానటి కన్నా ముందు పడిన హిట్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా “నేను లోకల్ ” అని చెప్పక తప్పదు .

మహానటి సినిమా ద్వారా ఎంత పాపులారిటీ దక్కించుకుందో అంతకుముందు నేను లోకల్ సినిమా ద్వారా కూడా అంతే క్రేజ్ దక్కించుకుంది . ఈ సినిమా విడుదల అయ్యి ఏడేళ్లు అవుతుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది కీర్తి సురేష్ . “నువ్వు నాకు పరిచయమై ఏడేళ్లకు పైగా అవుతుంది రా ..ఈ ఏడేళ్లు అలా చిటికలో గడిచినట్లు అనిపిస్తున్నాయి. చాలా చాలా బాగున్నాయి.. ఇంకా మనం కలిసి ఎన్నో ఎన్నో సినిమాలు చేయాలి “అంటూ నాని గురించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది .

దానికి నాని కూడా కీర్తి ని ట్యాగ్ చేస్తూ ..”నిన్ను ఇంకా ఇంకా డిస్టర్బ్ చేస్తూనే ఉంటా.. గెట్ రెడీ ” అంటూ కౌంటర్ వేశాడు . దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది . వీళ్లిద్దరు ఇంత మంచి ఫ్రెండ్సా ..?అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు . ప్రజెంట్ కీర్తి సురేష్ పై నాని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వీళ్లిద్దరి కాంబోలో దసరా కూడా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది..!!