పుష్ప 2 సెట్స్ లో క్రేజీ పిక్ క్లిక్ చేసిన శ్రీవల్లి.. వారెవా అదిరిపోయిందిగా..

నేషనల్ క్రష్‌ రష్మిక మందన వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ బ్యూటీగా క్రేజ్‌ సంపాదించుకున్న ఈ చిన్న‌ది తెలుగుతోపాటు తమిళ్, హిందీ భాషల్లోనూ ఫుల్ బిజీ బిజీగా దూసుకుపోతుంది. స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలను ద‌క్కించుకుంటూ మరింత పాపులార్ అవుతున్న‌ ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే యానిమల్ సినిమాతో భారీ సక్సెస్ అందుకుంది. ఇక గతంలో ర‌ష్మిక‌ మరో పాన్ ఇండియా సినిమా.. పుష్పా సినిమాలో నటించింది. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెష‌న‌ల్ అవార్డ్ అందుకున్నాడు. ఇప్పుడు ఆమె నటిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ పుష్పా 2. గతంలో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న పుష్పకు సీక్వెల్ గా ఈ సినిమా తెర‌కెక్కుతుంది. ఇందులో రష్మిక.. శ్రీవల్లి పాత్ర పోషిస్తుంది.

ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల పుష్ప గాడి సెట్ లో పాల్గొన్న శ్రీవల్లి ఓ క్రేజీ ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. గతంలో అల్లు అర్జున్ సుకుమార్ కాండెయిడ్‌ ఫోటోలు తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఫోటోలు తెగ మ‌క్క‌ర్లు కొట్టాయి. ఇప్పుడు రష్మిక మందన టర్న్ వచ్చింది. సుకుమార్ సింహం విగ్రహం పై చేతులు పెట్టి ఫోజు ఇచ్చిన ఓ క్రేజి ప‌వ‌ర్ ఫుల్ ఫోటోను ఈ ముద్దుగుమ్మ షేర్ చేసుకుంది.

ఇక‌ 2021 లో ప్రారంభమై రెండేళ్లు గడిచిన ఈ సిక్వెల్ పై ప్రేక్షకుల్లో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఎప్పటికప్పుడు సినిమాపై బ‌జ్‌ను పెంచేందుకు షూటింగ్ సెట్స్ లో ఫోటోలను మూవీ టీం షేర్ చేస్తూనే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ సుకుమార్ మాట్లాడుకుంటున్న ఫోటో ఒకటి వైరల్ గా మారింది. ఇటీవల రష్మిక ఓ ఫోటోను షేర్ చేసుకుంది. ఇక ఈ షూటింగ్ సెట్స్ లో సర్వే గంగా జరుగుతుంది. ఇక ఏడది ఆగస్టు 15న ఎట్టి పరిస్థితుల్లో సినిమాలో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు వివరించారు. ఈ సినిమా పుష్ప సినిమాకు మించి కోట్ల రూపాయల కలెక్షన్లు రాబడుతుందని అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.