సైలెంట్ గా కనిపించే సాయి పల్లవి ఏడవ తరగతి లోనే అలాంటి పనులు చేసిందా.. పిల్ల మహాముదురే..

ఫిదా సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి భానుమతిగా పక్కా తెలంగాణ యాస‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది సాయి పల్లవి. ఎప్పుడూ నవ్వుతూ నాచురల్ గా కనిపించే ఈ ముద్దుగుమ్మ.. ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ లవ్ లెటర్ ఎప్పుడు రాసింది అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పుకొచ్చింది. ఈమెకు ఓ లవ్ స్టోరీ కూడా ఉందంట. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కి వయసుతో సంబంధం లేదు అంటూ ఉంటారు. అలాగే ఆమె కూడా తన ఏడో తరగతి చదివే టైంలోనే ఓ లవ్ లెటర్ రాసింది. మొదటి చివర ప్రేమ లేక కూడా అదే అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది.

నేను రాసుకున్న ప్రేమలేఖ నాకు ఇప్పటికీ గుర్తుంది. అదే నా చివరి ప్రేమ లేక కూడా.. అంటూ వివరించింది. ఆమె మాట్లాడుతూ నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు నా స్కూల్లో ఓ అబ్బాయి నాకు నచ్చాడు. ఆ విషయాన్ని అతడికి ఎలా చెప్పాలో తెలియక లవ్ లెటర్ రాశా. కానీ ఆ లెటర్ అబ్బాయికి ఇచ్చే ధైర్యం లేదు ఇవ్వలేకపోయాను. అయితే ఆ లెటర్ ఇంట్లోనే ఉండిపోవడంతో దానిని పేరెంట్స్ చూశారు. బాగా తిట్టారు, కొట్టారు. దీంతో మళ్లీ అలాంటి లెటర్ల జోలికి వెళ్లలేదు. ఆ తిట్లు దెబ్బలు నాకు ఇంకా గుర్తున్నాయి అంటూ వివరించింది.

ఆ వయసులో అలాంటి లేక ఎలా రాయగలిగాను అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటూ వివరించింది. అది తలుచుకుంటే ఇప్పటికీ నవ్వొస్తుంది. లైఫ్ లో గుర్తుంచుకునే సంఘటనలు ఇలాంటి మెమరీస్ అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి. ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చూడడానికి సైలెంట్ గా కనిపించే మా సాయి పల్లవి ఇంత‌ ముదురా.. ఏడో తరగతిలోనే లవ్ ట్రాక్ నడిపిందా అంటూ అంత ఆశ్చర్యపోతున్నారు.