ప్రాణాలను రిస్క్ లో పెట్టి మరీ ఆ సీన్స్ లో నటించా.. కియారా అద్వానీ సెన్సేషనల్ కామెంట్స్..

బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సౌత్ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. సెన్సిటివ్ పాత్రలు ఎంచుకుంటూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె కెరీర్‌లో ఇప్పటి వరకు నటించని విభిన్నమైన పాత్రలో నటించేందుకు సిద్ధమైంది ఈ ముద్దుగుమ్మ‌. అసలు విషయం ఏంటంటే ప్రస్తుతం కియారా నటిస్తున్న సినిమాల్లో ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా డాన్ 3. డాన్ ఫ్రాంచైజ్‌ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో కియారా ఇప్పుడు భాగమయ్యారు.

ప్రియాంక చోప్రా రెస్పాన్సిబులిటీస్ ఈమె తీసుకుని.. ఆ ప్లేస్ ను రీప్లేస్ చేయనుంది. ఇందులో హీరోగా రణ్‌బీర్ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే తాజాగా ఈ సినిమాల్లో తన పాత్ర గురించి మీడియాతో ముచ్చటంచింది. మొదటిసారి ఈ సినిమా కోసం యాక్షన్స్ స‌న్నివేశాల్లో నటించా. ఈ క్యారెక్టర్ కోసం యాక్షన్ కొరియోగ్రాఫర్ దగ్గరికి వెళ్లి స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నా.. ప్రాణాలను రిస్క్ లో పెట్టి మరి కొన్ని సీన్స్‌ లో నటించా.

ఇంకా నటించాల్సిన యాక్షన్స్ స‌న్నివేశాలు చాలా ఉన్నాయి. ఈ సినిమాలో నేను రోమా పాత్రలో న‌టిస్తున్నా. ఈ మూవీలో ఓ కొత్త కియారాను మీరు చూడబోతున్నారు. థియేటర్‌లో ఆడియన్స్ అందరితో కలిసి సినిమా ఎంజాయ్ చేయాలని ఉంది అంటూ కియారా సినిమాల తన పాత్ర గురించి.. ఈ సినిమా చూడాలని ఆమెకున్న ఆసక్తి గురించి వివరించింది.