అర్థరాత్రి ఒంటిగంట వరకు రైటర్ తో కలిసి అలాంటి పని చేసిన బోల్డ్ యాంకర్ అనసూయ..

బోల్డ్ యాంకర్ అనసూయ.. మొదటి బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా పాపులారిటీ దక్కించుకుంది. తర్వాత సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ న‌టిగా వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతుంది. న‌ట‌న‌తో త‌న స‌త్తా చాటి పాపులారిటీ దక్కించుకుంటున్న ఈ బ్యూటి డిఫరెంట్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. పాజిటివ్, నెగిటివ్, బోల్డ్ ఇలా అన్ని పాత్రలలోనూ జీవించేస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో సందడి చేస్తూ అభిమానులకు హాట్‌ ట్రీట్ ఇస్తూ ఆకట్టుకుంటుంది. ఈ గ్లామర్ ఫోటోస్ వైరల్ అయినప్పుడల్లా కొన్నిసార్లు నెగటివ్ కామెంట్స్, ట్రోల్స్ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ క్రమంలో ఆమెకు వచ్చిన నెగటివ్ కామెంట్స్ పై రియాక్ట్ అవ్వడంతో వివాదాలు మరింతగా పెరిగేవి.

అలా బోల్డ్ యాంకర్ గా పేరు తెచ్చుకోవడమే కాకుండా కాంట్రవర్షియల్ బ్యూటీ అనే ముద్ర కూడా ఆమెపై పడింది. కానీ ఈ కామెంట్స్ ఏవి పట్టించుకోకుండా తన పని తానే చూసుకుంటూ ముందుకు వెళుతుంది అనసూయ. అయితే అనసూయకు ఈ రేంజ్ లో స్టార్‌డం ఒక్కసారిగా ఏం రాలేదు. కెరీర్‌లో ఆమె ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొందట. ఇప్పటికీ సర్వైవ్ అయ్యేందుకు వాటిని ఫేస్ చేస్తూనే ఉందని.. ప్రముఖ రైటర్ బెజవాడ ప్రసన్నకుమార్ వివరించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనసూయాకి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇప్పటివరకు ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలను వివరించాడు.

బెజవాడ ప్రస‌న్న కుమార్‌ రైటర్ జబర్దస్త్ కు పనిచేశాడు. అప్పటినుంచి అనసూయతో ఆయనకు మంచి పరిచయం ఉందట. ఆలీ టాకీస్ చేసే టైంలో తనకు కూడా స్కిట్లు చేసే అవకాశం వచ్చిందని.. ఆ టైంలో తనకు అనసూయ యాక్టింగ్ నేర్పించిందంటూ వివరించాడు. రైటర్ ప్రసన్నకుమార్ అన‌సూయా షూటింగ్ అయినా తరువాత కూడా నాకు హెల్ప్ చేశార‌ని.. రాత్రి 7, 8 గంటలకు తర్వాత నా ద‌గ్గ‌ర‌కు వచ్చేదని.. అర్ధరాత్రి ఒంటిగంట వరకు మేము రిహార్సల్స్ చేసేవాళ్లమని.. అనసూయ భర్త భ‌ర‌దంవాజ్ బయట కారులో ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉండేవాడని వివరించాడు. ప్రసన్నకుమార్ ఆమె వర్క్ కోసం ఎంతో డెడికేటెడ్ గా పనిచేసేది.. నాకు అంతే సహాయం చేసిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.