శ్రీదేవి, జయప్రదను ఒకే రూమ్‌లో ఉంచి తాళం వేసిన స్టార్ హీరో.. కారణం ఏంటంటే..?

అలనాటి స్టార్ హీరోయిన్స్ శ్రీదేవి, జయప్రదలకు టాలీవుడ్ లో ఎలాంటి స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరిని మించి ఒకరు తమ అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు సినిమాలో ఉంటే చాలు ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అనే టాక్ అప్పటి ప్రేక్షకుల్లో ఉండేది. వీరి సినిమాల కోసం జనం థియేటర్ల వద్ద క్యూ కట్టేవారు. ఆ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న శ్రీదేవి, జయప్రద బాలీవుడ్ లో కూడా తమ నటనతో సత్తా చాటారు. అయితే అప్పట్లో శ్రీదేవి, జయప్రద మధ్య కోల్డ్ వార్ జరుగుతుందంటూ.. వారిద్దరూ అసలు మాట్లాడుకునే మాట్లాడుకోరంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే సినిమాల పరంగా శ్రీదేవి కంటే జయప్రద సినియ‌ర్‌.. కానీ శ్రీదేవి లేట్ గా ఎంట్రీ ఇచ్చిన అడవి రాముడు సినిమాలు నటించి ఒక్కసారిగా స్టార్‌డమ్‌ సంపాదించుకుంది.

తర్వాత వరస హిట్ సినిమాలతో జయప్రద పోటీగా స్టార్ హీరోయిన్ అయింది. అయితే గతంలో కృష్ణ హీరోగా వచ్చిన బుర్రపాలెం బుల్లోడు సినిమాలో శ్రీదేవిని హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు. వాస్తవంగా ఈ సినిమాలో జయప్రదను హీరోయిన్గా భావించారట. 5 వేల‌ అడ్వాన్స్ కూడా ఇచ్చిన తర్వాత ఆ స్థానంలో శ్రీదేవిని తీసుకోవడంతో వీరిద్దరి మధ్య ఈ వివాదాలు మొదలయ్యాయని వార్తలు వినిపించాయి. తర్వాత వీరిద్దరూ ఎవరి సినిమాల్లో వారు బిజీ అయ్యారు. ఇక తెలుగులో వచ్చిన దేవత సినిమాలో వీరిద్దరూ అక్క, చెల్లెళ్ళుగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. నిజ జీవితంలో అక్క, చెల్లెలు కూడా అంతా అన్యోన్యంగా ఉండరేమో అనేంతగా జీవించారు. సినిమాల్లో క్యారెక్టర్స్ చేసేటప్పుడు ఎంత ఆప్యాయంగా మాట్లాడుకునే ఇద్దరు షార్ట్స్ అవగానే ఎవరి దారిలో వారు వెళ్లిపోతారట.

జయప్రద ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వివరించింది. అయితే మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ లేదు.. కానీ ఇద్దరం మాట్లాడుకోమంతే. నిజం చెప్పాలంటే శ్రీదేవి కాస్త యారోగెంట్‌ గా ఉంటుంది. ఇద్దరం షూటింగ్‌లో పోటీ పోటీగా నటించే వాళ్ళం. అయితే ఒక్కసారి ఆఫ్ స్క్రీన్ కి వెళ్ళాక ఆము అటూ, నేను ఇటు అన్నట్లే ఉండేవాళ్ళం. అలా హిందీలో మక్సాద్ అనే సినిమా కూడా ఇద్దరం కలిసి నటించాం. ఆ సినిమా షూటింగ్ టైంలో హీరో జితేంద్ర మేమిద్దరం అసలు మాట్లాడుకోవడం లేదని గమనించి.. మమ్మల్ని కలిపేందుకు తెగ ట్రై చేశాడు. మా ఇద్దరినీ ఒకే గదిలో ఉంచి బయట తాళం పెట్టాడు. అయితే గంటసేపు ఇద్దరు ఒకే రూమ్ లో ఉన్న.. మౌనంగానే ఉన్నాం తప్ప నోరు విప్పి మాట్లాడుకోలేదు అంటూ వివరించింది.