ఆ బంగ్లాన్ని చూస్తేనే స్టార్ హీరోలలో వ‌ణ‌కు పుడుతుందా.. దాని వెన‌కున షాకింగ్ రీజ‌న్ అదేనా..

సాధర‌ణ‌ ప్రేక్షకుల నుంచి స్టార్ సెలబ్రెటీస్ వరకు చాలామంది నమ్మకాలను పాటిస్తూ ఉంటారు. ముహూర్తం, వాస్తు ఇలా అన్నిటిని నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా ఇంటికి సంబంధించిన వాటిలో అయితే ఇంటి మంచి, చెడు.. నెగిటివ్ ఎనర్జీ ఎమైన ఉందా.. ఇలా అన్నీ చూపిస్తూ ఉంటారు. ఒకవేళ ఇంటి వాస్తు సరిగ్గా లేకపోయినా నెగటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో ఆర్థిక నష్టాలు, మనుషుల ఆరోగ్య సమస్యలు, ఒక్కొక్కసారి ప్ర‌ణ‌హాని కూడా జరుగుతూ ఉంటుంద‌ని అంతా నమ్ముతారు. అందువల్ల అద్దె ఇంట్లో లేదా కొనుగోలు చేసిన ఇంట్లో చేరేందుకు చాలా మంది ఆలోచనలు చేస్తూ ఉంటారు. పండితుల సలహా మేరకే ఇంటిలో నివసించడానికి సిద్ధమౌతారు. అయితే ఓ ఇంటిని చూస్తే ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోలంతా వణికిపోతున్నారట.

ఇంతకీ ఆ బాలీవుడ్ స్టార్ హీరోలు ఆ ఇల్లు చూసి అంతగా భయపడడానికి కారణం ఏంటి.. అసలు ఏం జరిగిందో.. చూద్దాం. ఆ ఇల్లు ఇప్పటివరకు ముగ్గురు బాలీవుడ్ స్టార్ హీరోలను పూర్తిగా దివాలా తీయించిందట. అడుగుపెట్టినప్పటి నుంచి వారు ఎన్నో సమస్యలను భారినపడడమే కాదు.. ఆర్థిక నష్టాలను ఎదుర్కొన్నారట. ఎంత మంచి కథ ఎంచుకొని సినిమాల్లో నటించిన అట్టర్ ప్లాప్ అవడం. డిజాస్టర్లతో కెరీర్ ఊహించని విధంగా ఫ్లాప్ అవడం.. అలాగే ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి అప్పుల పాలు అవ్వడం జరిగిందట. ఆ బంగ్లా ముంబైలో కార్డ్ రోడ్ ప్రాంతంలో ఆశీర్వాద్ అనే బంగ్లా అని.. ఇందులో వేరువేరు సమయాల్లో ఈ ముగ్గురు బాలీవుడ్ స్టార్లు ఉండేవారని తెలుస్తుంది. మొదట ఈ బంగ్లాలో బైజు బావ్,రా మీర్జా గాలిబ్, గేట్వే ఆఫ్ ఇండియా, బర్సాత్‌కి రాత్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి హిస్టరీ సృష్టించిన బాలీవుడ్ కింగ్ భరత్ భూషణ్ ఈ బంగ్లాని కొనుగోలు చేసి ఉండేవాడట.

అయితే ఆ ఇల్లు కొనుగోలు చేసి అక్కడ అడుగుపెట్టిన తరువాత సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ రకావడం అప్పుల ఊబిలో చిక్కుకొని ఆర్థిక సమస్యలతో ఉన్న ఇంటిని కూడా అమ్ముకోవడం జరిగిందట. తర్వాత ఇదే భవనంలోకి మరో ఇద్దరు స్టార్ హీరోలైనా రాజేంద్రకుమార్, రాజేష్ కన్నా కూడా అడుగుపెట్టారు. వీరిద్దరు కూడా అనుకోని విధంగా అదే సమస్యలతో ఆర్థికంగా నష్టాల్లో మునిగిపోయి ఆ ఇంటిని వదులుకున్నారు. దీంతో ఆ బంగ్లా అంటే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోస్ అందరిలో భయం పట్టుకుందట. ఆ ఇంటి వైపు చూడడానికి కూడా వారు ఇష్టపడడం లేదని.. చివరకు పారిశ్రామికవేత్త దాన్ని కొనుక్కొని ఓ ఔకానిక్‌ బంగ్లాను సృష్టించడానికి దానిని పగలగొట్టినట్లు తెలుస్తోంది.