సినిమా ఇండస్ట్రీలోనే సెన్సేషనల్ రికార్డ్.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది భాషల్లో రీమేక్ అయిన తెలుగు సినిమా ఇదే. !

సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలైనా రావచ్చు .. కొత్త కొత్త కాన్సెప్ట్ తో మూవీలు కూడా తెరకెక్కొచ్చు. కానీ సినీ లవర్స్ కి మాత్రం కొన్ని సినిమాలు ఎవర్ గ్రీన్ గా ఉండిపోతాయి. 100 కోట్లు కలెక్ట్ చేసిన సరే ఆ సినిమాలు ఇచ్చిన కిక్ మరి ఏ సినిమాలు ఇవ్వలేవు . అందులో ఒకటే “నువ్వు వస్తానంటే నేనొద్దంటానా”. హీరో సిద్ధార్ధ్ హీరోయిన్ త్రిష నటించిన ఈ సినిమా ఎన్ని అవార్డ్స్ కొల్లగొట్టిందో మనకు తెలిసిందే.

సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ ఒక్క సినిమాని ఏకంగా 10 భాషలో రీమేక్ చేశారు . ఇది అప్పట్లో ఓ రికార్డు అని చెప్పవచ్చు . కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకుడుగా మారిచేసిన చిత్రం ఇది కావడం గమనారహం. సిద్ధార్ధ్.. ఈ సినిమాలో ప్రేమించిన అమ్మాయి కోసం ఏమైనా చేసే పాత్రలో కనిపిస్తాడు. త్రిష కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. శ్రీహరి ఈ సినిమాకి కి రోల్ అని చెప్పాలి . 2005 లో విడుదలైన ఈ సినిమా యువతను ఓ రేంజ్ లో ఊపేసింది .

లవ్ రొమాన్స్ కామెడీ ఎమోషన్ జోడించి అద్భుతంగా తెరకెక్కించారు ప్రభుదేవా. ఈ సినిమాని ఎన్నిసార్లు చూసినా సరే తనవి తీరదు . ఇప్పటికి మనం యూట్యూబ్లో టీవీలో ఈ సినిమా వస్తే కళ్ళు ఆర్పకుండా ఎంజాయ్ చేస్తూ చూస్తాం. మరీ ముఖ్యంగా ఈ సినిమాలోని కొన్ని సీన్స్ పాటలు అభిమానులకి బాగా బుర్రకి ఎక్కుతాయి. ఈ సినిమాను చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు కూడా ఎంతోమంది ఉన్నారు..!!