రష్మిక ఒంటి పై ఉన్న టాటూ కి అర్ధం ఏమిటో తెలుసా..? మహా నాటి ఫెలో ఈ కన్నడ పిల్ల..!

సినిమా ఇండస్ట్రీలో నేషనల్ క్రిష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ప్రజెంట్ ఎలాంటి టాప్ మోస్ట్ స్థానాన్ని అందుకుందో మనకు తెలిసిందే. రీసెంట్గా ఆమె నటించిన యానిమల్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏకంగా 900 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషనల్ రికార్డును నెలకొల్పింది. ఈ క్రమంలోనే రష్మిక పేరు మరోసారి నెట్టింట మారుమ్రోగిపోతుంది .

రీసెంట్గా రష్మిక తన బాడీపై వేసుకున్న టాటూ కి అర్థం ఏంటో వివరించింది . చాలా మంది స్టార్ సెలబ్రిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ పదాలను .. బొమ్మలను ఒంటిపై టాటూగా వేయించుకుంటారు. ఇప్పటికే అలా చేసిన స్టార్ సెలబ్రిటీలను మనం చూశాం. అయితే రష్మిక వేయించుకున్న టాటూ చాలా డిఫరెంట్ గా ఉంది. ఆ టాటూ అభిమానులను ఆకర్షిస్తుంది. అయితే ఎందుకు టాటూ అలా వేయించుకుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగా మారింది.

“irreplaceable” అంటే మన లైఫ్ లో మన స్థానాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. అందుకే నేను ఆ పదాని అనే టాటూ ని వేయించుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. ప్రెసెంట్ రష్మిక టాటూ కి సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి . అంతేకాదు తెలుగులో మూడు సినిమాలు బాలీవుడ్ లో నాలుగు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ముందుకు వెళుతుంది కన్నడ పిల్ల రష్మిక మందన్నా..!!