70 ఏళ్ల బామ్మల తో రవి తేజ చేసిన పనికి అంతా షాక్.. ఆ దమ్ము ఏ పాన్ ఇండియా హీరోకి లేదు..!!

రవితేజ.. ఈ పేరు చెప్తే జనాలు ఏ రేంజ్ లో అరుస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఎటువంటి హెల్ప్ లేకుండా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి మాస్ మహారాజా గా మారి కోట్లాది మంది అభిమానుల ప్రేమలను దక్కించుకున్నాడు . ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్లు . అది రవితేజ విషయంలో ఫుల్ టు ఫుల్ క్లియర్గా ఉంటుంది . రవితేజ తన తోటి హీరోల కోసం ఎలాంటి త్యాగమైనా చేయడానికి సిద్ధపడతాడు . తన సినిమా రిలీజ్ అవుతుంది అని తెలిసినా కూడా పక్క హీరో సినిమా కోసం తన సినిమానే పోస్ట్ పోన్ చేసుకోవడం ..పక్క హీరో సినిమాలకు వాయిస్ ఓవర్ ఇవ్వడం రవితేజకు ఉన్న మంచి మనసుకు నిదర్శనం.

పెద్దవారితో చాలా పెద్దరికంగా బిహేవ్ చేస్తారు .. చిన్నవారితో తన తోటి వయసు ఉన్న వారితో చాలా జోవియల్ గా ఉంటాడు . రీసెంట్గా రవితేజ చేసిన పని నెట్టింట వైరల్ గా మారింది. 70 ఏళ్ల బామ్మల విషయంలో రవితేజ చేసిన ఓ పని అందరినీ ఆకట్టుకుంటుంది . రవితేజ – హరిష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కారంపూడి లో జరుగుతుంది. అయితే అక్కడికే వెకేషన్ కి వచ్చిన 70 ఏళ్ల బామ్మలు మిస్టర్ బచ్చన్ షూటింగ్ సెట్స్ కి వచ్చి రవితేజాన్ని కలవడం కుదురుతుందా..? అంటూ అడిగారట.

షూటింగ్ లో ఉన్నారు అని చెప్పడంతో..అక్కడి నుంచి వెళ్ళిపోయారు . ఇక ఇది తెలుసుకున్న రవితేజ షూటింగ్ అయిన తర్వాత వారిని కలవడం కోసం వాళ్ళ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లడం గమనార్హం .ఆ సమయానికి వాళ్లు భోజనం చేస్తూ ఉంటున్నారట. ఇక రవితేజ రావడంతో భోజనం ఆపేసి రాబోయారట . అయితే వారిని రవితేజ భోజనం చేసి రండి నేను వెయిట్ చేస్తాను అంటూ ప్రేమగా ఆప్యాయంగా పలకరించారట . వాళ్లతో కొంతసేపు మాట్లాడి ఫోటో దిగి సంతోషపరిచారట . దీంతో రవితేజ సింప్లిసిటీకి సంబంధించిన విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది . అంతేకాదు రవితేజ అభిమానులు మరి ఏ హీరో కూడా ఇలా చేయలేడు అంటూ గర్వంగా రవితేజను ప్రశంసిస్తున్నారు..!!