బాలీవుడ్ ‘ రామాయణం ‘లో రకుల్ ప్రీత్.. ఆ రిస్కీ పాత్రలో నటించిన ముద్దుగుమ్మ..

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా భారీ పాపులార్టి దక్కించుకున్న రకుల్ ప్రీత్ సింగ్‌కు.. ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో మొదలుపెట్టి దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలు అందరు సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. మెల్లమెల్లగా టాలీవుడ్ అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. ఇక అక్కడ వెబ్ సిరీస్ లపై ఎక్కువ కాన్సెంట్రేట్ చేస్తూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల సంక్రాంతికి రిలీజ్ అయినా ఆయాలన్‌ మూవీలో శివ కార్తికేయ స‌ర‌సన నటించింది.

नितेश तिवारी की फिल्म रामायण | Nitesh Tiwari Ramayana Movie | Bollywood  Newstrack | Nitesh Tiwari Ramayana Movie: क्या दर्शकों को पसंद आएगी 'रामायण'?  शुरू हुआ काम | News Track in Hindi

ఈ సినిమా తెలుగులో రిలీజ్ కాలేదు. కాగా తమిళ్ లో కమర్షియ‌ల్‌ సక్సెస్ అందుకుంది. ఈ నేపథ్యంలో ఓ పాన్ ఇండియా మూవీలో ర‌క్కుల్‌.. రిస్కీ పాత్రకు సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది. భారతీయ చరిత్రలోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మైథిలాజికల్ మూవీగా నితీష్‌తివారి రామాయణాన్ని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కనుంది. ఇక ఈ మూవీకి కావాల్సిన క్యాస్టింగ్ పనులు ఇటీవల సరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే బాలీవుడ్ రామాయణంలో పలు పాత్రల్లో చాలామంది స్టార్స్ సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపించాయి.

Hundred Actress Lara Dutta On Sexism: "As Women, We All Have Faced It In  Our Life..."

రాముడు గా ర‌ణ్‌బీర్ క‌పూర్, హనుమంతుడిగా బాబీ డియోల్‌ను తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. అలాగే సీత పాత్రలో సాయి పల్లవిని సెలెక్ట్ చేశారట. అయితే దీనిపై అఫీషియల్ ప్ర‌క‌ట‌న‌ రాలేదు. అలాగే కేజీఎఫ్తో భారీ బ్లాక్ బస్టర్ అందుకొని.. ప్రస్తుతం టాక్సిక్ మూవీ తో బిజీగా గడుపుతున్న మ‌ష్ రావణుడి పాత్రలో కనిపించబోతున్నాడని టాక్. కైకగా లారా దత్త, విభీషుణుడిగా విజయ్ సేతుపతిని తీసుకున్నారట మేకర్స్. మరి రకుల్ కి ఇవ్వబోయే ఆ క్యారెక్టర్ ఏంటని అంశంపై ఇటీవల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే రావణాసురుడి చెల్లి సూర్పణ‌క పాత్రలో రకుల్ ని మేకర్స్ అడిగినట్లు ఇన్సైడ్ వర్గాల టాక్.

Rakul Preet Singh Antique Necklace - Jewellery Designs

సాధారణంగా చాలా సీరియల్లో ఆవిడను రాక్షసిగా చూపిస్తారు. కానీ నిజానికి సూర్పణ‌క మంచి అందగత్తె.. అందుకే లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు కోసి ఆమెను అంద విహీనంగా చేస్తాడని పుస్తకాల్లో ఉంటుంది. ఈ అంశాన్ని నితీష్ తివారి తెలివిగా చూపించేందుకు రకుల్‌కు అవకాశాన్ని ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ పాత్రను వర్ణించేటప్పుడు రకుల్‌కి ఇది పాజిటివ్గా అనిపిస్తే తప్పకుండా ఒప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ పై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే ఈ సినిమాలో నటించిన నటీనటుల వివరాలను ప్రెస్ మీట్ ద్వారా మేకర్స్ తెలియజేస్తారు.