జాక్ పాట్ కొట్టేసినా ‘ నా సామిరంగా ‘ హీరోయిన్.. ఏకంగా ఆ బ‌డ్డా మూవీలో ఛాన్స్ ..

ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పుడిప్పుడే పాపులారిటీ దక్కించుకుంటున్న ముద్దుగుమ్మల్లో అషికా రంగనాథన్ ఒకటి. 2023లో కళ్యాణ్‌రామ్ అమీగోస్‌ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. కాగా ఈ సినిమాతో పెద్ద సక్సెస్ రాకపోయినా.. ఈమె న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. ఎన్నో రాత్రులు వస్తాయి కానీ అనే రీమిక్స్ పాటలో ప్రేక్షకులను ఫిదా చేసింది. తర్వాత నాగార్జున నటించిన నా సామిరంగా సినిమాతో ఈమెకు మరో అవకాశం వచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమాలో వరాలు అనే మిడిల్‌ఏజ్ రోల్ లో నటించి మెప్పించింది ఆషిక. సీనియర్ హీరోల సరసన అనుష్క, నయనతార, త్రిషా మాత్రమే సెట్ అవుతారంటూ చాలామందికి అభిప్రాయం ఉండేది.

అయితే ఇప్పుడు ఆ అభిప్రాయం మారిపోయింది. వాళ్ళే కాదు ఆషికా రంగనాథన్ కూడా సీనియర్ హీరోలకు జోడిగా మంచి ఆప్షన్ అని డైరెక్టర్ ఫిక్స్ అవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఆషికా ఓ భారీ ప్రాజెక్టులో నటించే అవకాశాన్ని కొట్టేసింది. టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి సినిమాల్లో ఆమెకు అవకాశం దక్కింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మళ్ళిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆషికాకు అవకాశం వచ్చింది. ఈ సినిమాలో చిరుకి జోడిగా త్రిష ఎంపికైన సంగతి తెలిసిందే.

ఆల్రెడీ ఆమె షూటింగ్లో కూడా పాల్గొంటుంది. అయితే కథ ప్రకారం సినిమాలో చిరంజీవికి ఐదుగురు సోదరులు ఉంటారట. ఆ పాత్రలకి సినిమాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉందని.. అలా చిరు సోదరి పాత్రలో ఆషికా రంగనాథన్ ను సంప్రదించినట్లు తెలుస్తుంది. ఇక ఈ పాత్రకు ఆషికా రంగనాథన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. తెలుగులో ప్రస్తుతం ఆమెకు ఆఫర్లు లేవన్న సంగతి తెలిసిందే. దీంతో ఎలాగో విశ్వంభ‌రలో వస్తున్న రోల్ కు వెయిటేజ్ ఉంది అనే ఉద్దేశంతో పాజిటివ్గా రియాక్ట్ అయిందని తెలుస్తోంది.