కెరీర్ లో ఫస్ట్ టైం ఇలా..ఎన్టీఆర్ కోసం అలాంటి పని చేయబోతున్న జాన్వీ.. నిజమైన అభిమానం అంటే ఇదే..!

జాన్వి కపూర్ .. శ్రీదేవి ముద్దుల కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో దేవర తో ఏంట్రీ ఇవ్వబోతుంది . ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . ఈ సినిమా కోసం బాగా కష్టపడుతుంది జాన్వి కపూర్ అంటూ వార్తలు కూడా వైరల్ అవుతున్నాయ్. ఈ సినిమాల్లో పూర్తిగా విలేజ్ వాతావరణం లో పెరిగిన అమ్మాయిగా కనిపించబోతుందట జాన్వి కపూర్.

రీసెంట్ గా జాన్వీ కపూర్ ..దేవర సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ అభిమానులతో షేర్ చేసుకుంది. ” త్వరలోనే దేవర సినిమాకు డబ్బింగ్ చెప్పబోతున్నాను అని.. పూర్తిగా నా పాత్ర కు నేనే డబ్ చెప్పుకుంటున్నాను అని.. త్వరలోనే ఇకపై ఇంగ్లీష్ లేకుండా పూర్తి తెలుగులో మీ అందరితో మాట్లాడడానికి ట్రై చేస్తాను” అని చెప్పుకు వచ్చింది . దీంతో అభిమానులు ఫుల్ ఫిదా అయిపోయారు.

అంతేకాదు.. ఈ సినిమాలో ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి కారణం ఎన్టీఆర్ పై ఆమెకున్న అభిమానమే అంటూ చెబుతున్నారు జనాలు . ఎన్టీఆర్ తనను నమ్మి ఛాన్స్ ఇచ్చిన కారణంగా ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆయన దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి ఇలాంటి నిర్ణయం తీసుకుందట. దీంతో సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ పేరు వైరల్ అవుతుంది. మొత్తానికి నందమూరి అభిమానులను బాగానే పడగొట్టింది పిల్ల..!!