రష్మిక ఫ్యాన్స్ కు గుండె బద్దలయ్య న్యూస్.. ఆ సినిమా ఆగిపోయిందా..

కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈమెకు బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఇటీవల వచ్చిన యానిమల్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. గతంలో పుష్ప సినిమాతో నేషనల్ క్ర‌ష్ గా మారింది. ఇక మరోసారి యానిమల్ సినిమాతో సక్సెస్ అందుకోవడంతో ఈమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ క్రేజ్ తో రష్మిక ప్రస్తుతం నటిస్తున్న ఫిమేల్ సెంట్రిక్‌ మూవీ రెయిన్‌బో కి సమస్యలు తలెత్తుతున్నాయట. రెయిన్ బో లేడీ ఓరియంటెడ్ సినిమాగా రూపొందుతున్న‌ సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో రష్మిక లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇక ఈ సినిమా ఒప్పుకునే సమయానికి రష్మికకు బాలీవుడ్ లో ఆ రేంజ్ లో క్రేజ్ లేదు. ఇప్పుడు నేషనల్ లెవెల్ లో అమ్మ‌డుకి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని.. కథలో కొన్ని మార్పులు చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇక దీంతో పాటే రెమ్యూనరేషన్ విషయంలో కూడా కాస్త రష్మిక డిమాండ్ పెరిగిందని.. ఆ విషయంలో కూడా మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో పాటు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలోని రష్మిక నటిస్తుంది. రెండు సినిమాలకు అమ్మడికి భారీగా రెమ్యూనరేషన్ అందుతున్నట్లు టాక్. ఇక ర‌ష్మిక న‌ట‌న విష‌యానికొస్తే పర్ఫామెన్స్ తో ఖచ్చితంగా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది అంటున్నారు నెటిజన్లు.

ఇక ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమా రెయిన్‌బో ఆగిపోయిందని తెలియడంతో.. మళ్లీ మొదలవుతుందా.. లేదా.. అనే అంశంపై ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలో కూడా ఒకసారి రష్మికను చూడాలని ఫ్యాన్స్ తాపత్రయ పడుతున్నారు. అయితే ఇప్పటివరకు 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కు రష్మిక బల్క్ డేట్స్ ఇస్తేనే కానీ సినిమా పూర్తి అవ్వదు.. దీంతో ఈ సినిమా రిలీజ్ అవ్వడమే కష్టం అంటూ మరోవైపు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం రష్మిక ఫోకస్ అంతా బాలీవుడ్ వైపే ఉంది.