బాక్సాఫీస్ బరిలో తలపడనున్న బాబాయ్, అబ్బాయి.. మరోసారి బాలయ్యకు ఎదురు వెళ్తున్న తారక్..

ఎట్ట‌కేలకు దేవర మూవీ రిలీజ్ పై క్లారిటీ వచ్చేసింది. మొదట ఏప్రిల్ 5న సినిమా రిలీజ్ అవుతున్నట్లు మేకర్స్ అనౌన్స్‌ చేయగా.. ఏవో కారణాలతో సినిమా ఆరు నెలలు పోస్ట్ పొన్ అయ్యింది. దేవర సమ్మర్ సీజన్ మిస్ చేసుకున్న.. మరో సాలిడ్ ఫెస్టివల్ సీసన్ పై కన్నేశారు మేకర్స్. దసరాకు దేవర సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అక్టోబర్ 10 న దసరా కానుకగా సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దేవర సినిమా వాయిదాకు ఎన్నో రీజన్స్ ఉన్నాయి. మొదటిది అందరూ హైలైట్ చేస్తున్నది.. ఏపీ ఎల‌క్ష‌న్స్‌. ఆ టైంలో దేవరని రిలీజ్ చేస్తే కాస్త ఇబ్బందులు ఎదురవుతాయని వాయిదా వేస్తున్నారట‌.

మరోవైపు అనిరుధ్‌ కూడా ఇప్పటివరకు ఒక పాటను కూడా చేసి ఇవ్వలేదట.. దీంతో షూట్ కూడా పూర్తి కాలేదు. మరోవైపు టాకీ కూడా పూర్తి కాకపోవడంతో ఇంకా సినిమా నడుస్తూనే ఉంది. దీంతో మూవీ రిలీజ్‌ను వాయిదా వేయడమే మంచి నిర్ణయం అని మేకర్స్‌ భావించారట. ఆ కారణంగానే ఏప్రిల్ 5న అనైన్స్ చేసిన మూవీని ఆరు నెలల గ్యాప్ తో అక్టోబర్ 10న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారట. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్యకు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ మరోసారి ఎదురెళ్ళిపోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కారణం ఏంటంటే బాలయ్య కూడా.. దసరా అనే టార్గెట్ చేస్తూ త‌న‌ 109వ‌ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేశాడ‌ట.

2023లో దసరాకి భగవంత్‌ కేసరి వచ్చి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకోవడంతో.. అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేసేలా బాబి, బాలయ్య ప్లాన్ చేశారని తెలుస్తుంది. అదే జరిగితే బాక్స్ ఆఫీస్ బ‌రిలో బాబాయి, అబ్బాయి పోరు గట్టిగా ఉంటుంది. గతంలో నాన్నకు ప్రేమతో, డిక్టేటర్ ఈ రెండు మూవీస్ కూడా ఒక రోజు గ్యాప్ లో సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యాయి. అయితే అప్పుడు బాబాయ్ బోల్తాపడ్డ.. అబ్బాయి సక్సెస్ అందుకుని పాపులారిటీ దక్కించుకున్నాడు. మరి ఈసారి దసరా సీజన్లో వీరిద్దరి కాంపిటీషన్ రిపీట్ అవుతుంది. ఈసారి సక్సెస్ ఎవరిది అవుతుందో చూడాలి.