మరి ఇంత దారుణమా.. సొంత స్నేహితుడే ఎన్టీఆర్‌ను నమ్మించి ఇంత దారుణంగా మోసం చేశాడా..?

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కాగా 18 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఎన్టీఆర్‌కు కెరీర్ ప్రారంభంలో ఫ్యామిలీ సపోర్ట్ లేదు. సీనియర్ ఎన్టీఆర్ ఆయ‌న‌ను చేరదీసి తన పేరును గిఫ్ట్ గా ఇచ్చి ఆశీర్వదించాడు. ఆ తర్వాత ఓ సినిమా హిందీ వర్షన్ కోసం ఎన్టీఆర్‌ను తీసుకున్నారు. కానీ ఆ సినిమా రిలీజే కాలేదు. ఇక సీనియర్ ఎన్టీఆర్ కాలం చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ త‌న‌కున్న‌ పెద్ద సపోర్ట్ కోల్పోయాడు. అయితే హరికృష్ణ గారు పెద్ద నిర్మాతలతో సినిమాలు నిర్మించేలా ప్లాన్ చేశాడు. హరికృష్ణకు స్టార్ హీరోలు రేంజ్ లో క్రేజ్ లేకపోవడంతో ఎన్టీఆర్‌ను యువ దర్శకుల చేతిలో పెట్టాడు.

50 Junior N.T.R Best Of All Times, ntr beard HD wallpaper | Pxfuel

కానీ ఓ విధంగా అది ఎన్టీఆర్ కు ప్లస్ అయింది. వినాయక్, రాజమౌళి లాంటి సరైన డైరెక్టర్ల చేతిలో ఎన్టీఆర్‌ను పెట్టాడు. దీంతో ఎన్టీఆర్‌కు త్వరగా స్టార్‌డ‌మ్ వచ్చింది. కాగా ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంలోనే చాలామందిని గుడ్డిగా నమ్మి భారీ మొత్తంలో నష్టపోయాడట. వారిలో ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్ గా భావించే వ్యక్తి ఒకడు. అతని వల్ల చాలా డబ్బు ఎన్టీఆర్ కోల్పోయాడని తెలుస్తోంది. సింహాద్రి సినిమాతో ఎన్టీఆర్ సూపర్ సక్సెస్ అందుకోగా.. ఈ సినిమా తెచ్చి పెట్టిన క్రేజ్ తో ఎన్టీఆర్ కు బడా ప్రాజెక్టులు క్యూ కట్టాయి. అదే టైంలో చాలామంది నిర్మాతలు ఎన్టీఆర్ కాల్ షీట్ల కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్ ఎన్టీఆర్ కాల్ షీట్లు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశాడట. ఆ విషయం ఎన్టీఆర్‌కు తెలియదు. ఇక ఆంధ్రావాలా, నా అల్లుడు, సాంబ, నరసింహుడు లాంటి సినిమాలు డిజాస్టర్లు అవ్వడంతో తర్వాత కొన్ని ప్రాజెక్టులు సెట్ చేసుకున్నాడు ఎన్టీఆర్.

Jr NTR tests positive for coronavirus

అయితే ఎప్పటికీ కాల్ షీట్లు ఇవ్వడం లేదని డబ్బులు తీసుకున్న నిర్మాతలు సహనం కోల్పోయి ఎన్టీఆర్ వద్దకు వచ్చి.. మీ వల్ల మేము చాలా నష్టపోతున్నాము.. నీకు ఇచ్చిన అమౌంట్ కు ఇంట్రెస్ట్ లు కడుతూన్నాము. మాకు కాల్‌షీట్లు ఇవ్వడం లేదు అంటూ నిలదీశారట. ఇందుకు ఎన్టీఆర్ అయోమయంతో నేను కాల్ షీట్లు ఇస్తానని ఎప్పుడు చెప్పాను అంటూ ప్రశ్నించాడట. ఆ నిర్మాతలు నీ స్నేహితుల ద్వారా అడ్వాన్సుగా తీసుకొని ఇప్పుడు బుకాయిస్తున్నావా అని విమర్శించడంతో.. ఎన్టీఆర్ దానిపై ఆరా తీయగా అది నిజమే అని తెలిసింది. వాళ్లకు నచ్చచెప్పి భవిష్యత్తులో సినిమా చేస్తానని చెప్పిన వారు వినకపోవడంతో.. చేసేదేమీ లేక తన దగ్గర ఉన్న డబ్బులు అంతా ఇచ్చి నిర్మాతలను పంపించేశాడట ఎన్టీఆర్. ఇక అప్పటి నుంచి తన బెస్ట్ ఫ్రెండ్ ను కనీసం ఎన్టీఆర్ చేరదీయలేదని తెలుస్తుంది.