ఆ రెండు సినిమాలు చేసుంటే మహేష్ కెరియర్ మరోలా ఉండేదా.. తప్పు చేశావు బ్రదర్..!!

ఎస్ ప్రెసెంట్ ..ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు తాజాగా నటించిన సినిమా గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ అయింది . బాక్సాఫీస్ వద్ద యావరేజ్ హిట్గా నిలిచింది . సినిమాలో పెద్దగా కంటెంట్ లేదు అంటూ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు జనాలు .

ఇలాంటి క్రమంలోనే గతంలో రెండు బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాలను మహేష్ బాబు వదులుకునేసాడు అన్న వార్త వైరల్ అవుతుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమాలో మొదటగా హీరోగా రామ్ చరణ్ కంటే ముందే మహేష్ బాబును అనుకున్నాడట డైరెక్టర్ సుకుమార్. కానీ మహేష్ బాబు ఈ కథను రిజెక్ట్ చేశాడట. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ ని ఏ స్థాయిలో పుంజుకునేలా చేసిందో మనకు తెలిసిందే.

ఆ తర్వాత పుష్ప సినిమా కథను కూడా ముందుగా మహేష్ బాబుకి వివరించారట సుకుమార్ . అది కూడా రిజెక్ట్ చేశాడట . దీంతో రెండు బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్న హీరోగా మహేష్ బాబు రికార్డులు క్రియేట్ చేశాడు . ఈ రెండు సినిమాలు చేసి ఉంటే మహేష్ బాబు కెరియర్ ఏ రేంజ్ లో మారిపోయి ఉండేదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తెలిసి తెలిసి తప్పు చేస్తున్నావ్ మహేష్ అంటూ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు..!!