రాసి పెట్టుకోండి.. ఆ రికార్డులను బద్దలు కొట్టే.. సత్తా ఉన్న ఏకైక హీరో మన తారక్ మాత్రమే..!

సినిమా ఇండస్ట్రీలో చాలామంది సెంటిమెంట్స్ ఫాలో అవుతూ ఉంటారు . మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ అందరికీ తెలిసిందే . ఆయనతో సినిమాలో నటించిన తర్వాత ఆయన తర్వాతి సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అంటూ చరిత్ర చెబుతున్న పాఠాలు ఎన్నో ఉన్నాయి . ఒకరు కాదు ఇద్దరు కాదు ఆల్మోస్ట్ ఆల్ అందరి హీరోలు ఆ బ్యాడ్ సెంటిమెంట్కు బలైపోయారు .

ప్రభాస్ – రవితేజ – రామ్ చరణ్ – సునీల్ ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు అందరూ హీరోలు బొక్క బోర్లా పడ్డారు . అయితే ఆ బ్యాడ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేయబోతున్నాడు ఎన్టీఆర్ అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కబోతుంది .

ఏప్రిల్ 5 2024న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . రీసెంట్గా రిలీజ్ అయిన గ్లింప్స్ సోషల్ మీడియాని షేక్ చేసి పడేసింది . ఈ క్రమంలోనే ఆ బ్యాడ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేసే సత్తా ఉన్న హీరో మన ఎన్టీఆర్ అంటూ నందమూరి ఫ్యాన్స్ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు. చూద్దాం ఈ సినిమాతో తారక్ ఎలాంటి హిట్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడో..??