తేజ సజ్జ నెక్స్ట్ సినిమా ఏ డైరెక్టర్ తోనో తెలుసా.. నో డౌట్ మరో హిట్ పక్క..!

తేజ సజ్జ .. నిన్న మొన్నటి వరకు ఈ పేరు చెప్తే చాలా తక్కువ మంది జనాలు మాత్రమే గుర్తుపట్టే వాళ్ళు . ఇండస్ట్రీలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు ..ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్నాడు .ఇంతవరకే తెలుసు కానీ ఇప్పుడు తేజ సజ్జ అంటే కష్టానికి మరో మారు రూపం. ఎంతో హార్డ్ వర్క్ చేస్తాడు ..తన సినిమాల కోసం ఎంతకైనా తెగిస్తాడు.. ఇలాంటి కామెంట్స్ తో ఆయన పేరుని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు .

గుంటూరు కారం సినిమాకి కాంపిటీషన్ ఇస్తూ రిలీజ్ చేసిన సినిమా హనుమాన్ . ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించాడు. అమృత అయ్యారు హీరోయిన్ గా నటించింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హ్యూజ్ పాజిటివ్ టాక్ దక్కించుకుంది .

ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి . కాగా తేజ సబ్జా నెక్స్ట్ ఏ డైరెక్టర్ దర్శకత్వంలో నటించబోతున్నాడు అన్న వార్త వైరల్ అవుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో తేజ ఓ మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ సినిమాను ఓకే చేశారట . త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుందట . దీంతో సోషల్ మీడియాలో ఇదే వార్త వైరల్ అవుతుంది..!