గుట్టు చప్పుడు కాకుండా సుడిగాలి సుదీర్ టైటిల్ ని దొబ్బేసిన ఆ స్టార్ హీరో.. ఏంటి భయ్యా ఇది..!

హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవలే లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ ని అందుకున్నాడు విజయ్. ఇక ఈ మూవీ అనంతరం టాలెంటెడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తో తన కెరీర్ 68వ మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ తాలూకా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ థ్రిల్ అయ్యారు.

మెయిన్ గా టైటిల్ ” గ్రేటెస్ట్ అఫ్ ఆన్ టైం ” అనేదానికి ఆడియన్స్ బాగా థ్రిల్ అయ్యారు. ఇక ఈ టైటిల్ అభిమానుల్లోకి బానే వెళ్ళింది కానీ.. ఈ టైటిల్ని సరిగ్గా పరిశీలిస్తే ఈ టైటిల్ పై ఓ మూవీ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ టైటిల్ ని చూస్తే..సుడిగాలి సుదీర్ హీరోగా నటించిన మాస్‌ సినిమా గుర్తొస్తుంది.

దర్శకుడు నరేష్ కుప్పిలి తెరకెక్కించిన మూవీ కూడా విజయ్ సినిమా జి ఓ ఏ టి అనే టైటిల్ మీద అనౌన్స్ అయ్యి టీజర్ పోస్టర్లు కూడా వచ్చాయి. ఇక ఇదే టైటిల్ తో విజయ్ సినిమా కూడా అనౌన్స్ కావడం గమనార్హం. ఇక గతంలో లియో వర్షం కి రిలీజ్ కి ముందు సేమ్ టైటిల్ మరొకరు దగ్గర ఉందని కాస్త హడావిడి జరిగింది. ఇక మళ్లీ ఇదే తరహాలో ఈ సినిమాకి కూడా జరుగుతుంది. ఇక ఈ వార్త చూసిన ప్రేక్షకులు..” గుట్టు చప్పుడు కాకుండా సుధీర్ టైటిల్ బానే దొబ్బేసావు కదా బ్రో ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.