కూతురు పుట్టిన రోజు సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన తారకరత్న భార్య… కంటతడి పెడుతున్న ఫ్యాన్స్..!

2023 ఫిబ్రవరి నెలలో తారకరత్న మృతి చెందిన సంగతి తెలిసిందే. అందరి మంచి కోరే మంచి హీరోగా పేరు సంపాదించుకున్న తారకరత్న మరణం అభిమానులకు తీరని లోటు మిగిల్చింది. ఇక తాజాగా నిష్క పుట్టినరోజు సందర్భంగా అలేఖ్య ఎమోషనల్ పోస్ట్ ఒకటి షేర్ చేసింది.

అలేఖ్య తన పోస్టులో కూతురు విష్క ని ప్రశంసిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈమె పోస్టులో రాసుకొచ్చింది ఏమిటంటే..” నువ్వు నా లోకానికి వచ్చిన నిమిషం నుంచి మాకెంతో గర్వంగా ఉంది. నీ నవ్వు, ప్రేమ ఎప్పుడూ ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నా.

అలాగే మీ అమ్మ ఎప్పుడు మీతోనే ఉంటుంది. విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ” అంటూ విషెస్ తెలిపింది అలేఖ్య. ప్రస్తుతం ఈమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈమె పోస్టు చూసిన తారకరత్న అభిమానులు..” పాపం ఆవిడిలో ఎంత ఎమోషన్ ఉంటే ఇంతలా పోస్ట్ పెడుతుంది. ఐ మిస్ యు తారకరత్న అన్న ” అంటూ కంటతడి పెట్టుకుంటున్నారు.