ఈ ఫుడ్ తినడం వల్ల ఆడవారిలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయని తెలుసా..?

ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ లో ఆడవారు కూడా బయట ఆఫీస్ వర్క్ లకు వెళుతూ.. బిజీ షెడ్యూల్ ని గ‌డుపుతూ ఉంటారు. ఆఫీస్ టెన్ష‌న్‌, ఇంటి పనుల‌తో సర్దుకొని ఆఫీస్ కి వెళ్లి అక్కడ వర్క్ చేసి మళ్లీ ఇంటికి వచ్చి స్ట్రెస్ ఫీలవుతూ కొంతమంది మహిళలు డిప్రెషన్‌కు కూడా లోనవుతూ ఉంటారు. అయితే అలా ఒత్తిడి తగ్గించేందుకు మహిళల్లో రోజంతా హ్యాపీ హార్మోన్లు రిలీజ్ చేసేందుకు ఈ ఆహారాలు బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెప్తున్నారు. పండ్లను తీసుకుంటే మహిళల్లో మంచి మూడు వస్తుందట.

ఇందులో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని చెప్తున్నారు. స్ట్రెస్ తగ్గించడానికి కూడా ఆవకాడో బాగా పనిచేస్తుంది. బ్లూబెర్రీస్‌ని తీసుకుంటే మహిళల్లో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా వీటిలో సమృద్ధిగా లభిస్తాయి. అలాగే చెర్రీ టమాటాలు తిన్న కూడా డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేయడానికి కూడా ఇది తోడ్పడుతుంది. అరటిపండ్లతో కూడా హ్యాపీ హర్మోన్స్‌ రిలీజ్ అవుతాయని నిపుణులు చెప్తున్నారు.

ఎన్ని రకాలుగా పోషక విలువలు ఉంటాయో అందరికి తెలుసు. ఇందులో ఉండే విటమిన్ b6 ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. అలాగే మంచి మూడ్‌కి కూడా కారణం అవుతుంది. ఇక డార్క్ చాక్లెట్‌తో కూడా మహిళల్లో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అలాగే ఓట్స్ ని తీసుకోవడం వల్ల యాంగ్రీ స్ట్రెస్ లాంటి మూడ్‌ స్వింగ్స్ నుంచి రిలీఫ్ లభిస్తుంది. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇక బాదం, వాల్నట్స్‌ను రోజు రెండు మూడు తీసుకోవడం అలవాటు చేసుకుంటే అవి మనకు ప్రశాంతంగా ఉంచుతాయట.