ఆ స్టార్ హీరో తో సుకుమార్ పాన్ ఇండియా మూవీ.. ఈసారి పుష్పాను మించిన బ్లాక్ బస్టర్ పక్క..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రంగస్థలం వచ్చి ఎలాంటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లోనే నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసిన ఈ సినిమా రామ్ చరణ్ ని కొత్తగా ఆవిష్కరించిందని చెప్పవచ్చు. అదే టైంలో సుకుమార్ కాస్త దిగివచ్చి సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాతో అందరికీ చూపించాడు. అప్పట్లోనే ఇది రూ.200 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి భారీ సక్సెస్ అందుకుంది. దీంతో వీరిద్దరి కాంబో బ్లాక్ బ‌స్టర్ కాంబో గా నిలిచిపోయింది. ఇప్పుడు ఈ కాంబో మళ్లీ రిపీట్ కాబోతుంది. మరోసారి ఈ కాంబినేషన్లో పాన్ ఇండియా సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సుకుమార్ పుష్ప షూటింగ్లో బిజీగా ఉన్నాడు.

Pushpa 2: The Rule - Wikipedia

ఇది ఆగస్టు 15న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక దీంతో ఆగస్టు నెల తరువాత సుకుమార్ ఫ్రీ అయిపోతాడు. అప్పటి నుంచి రామ్ చరణ్ తో మరో ప్రాజెక్ట్‌ చేయబోతున్నాడట. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు జరిగినట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా లాక్ అయిందని తెలుస్తుంది. డేట్స్, బడ్జెట్ కూడా ఫైనల్ అయిపోయాయట. ఈ కాంబో చాలా రోజుల క్రితమే ఓకే అయినట్లు తెలుస్తుంది. పుష్ప 2 పూర్తయిన వెంటనే దీనిపై వర్క్ మొదులు పెడతారట. అక్టోబర్ నుంచి ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అవుతున్నాయని సమాచారం. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది.

Ram Charan's Hit Film, 'Rangasthalam' To Release In Hindi in

ఈ సినిమాకు ఏకంగా రూ.400 కోట్ల బడ్జెట్ ఎస్టిమేట్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో, సినీ వ‌ర్గాల‌లో ఈ న్యూస్ తెగ చెక్క‌ర్లు కొడుతుంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాలి. కాగా ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో రామ్‌చరణ్ నటిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. దీని తర్వాత బుచ్చిబాబు సన్నా తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమా కూడా పూర్తయిన తర్వాతే సుకుమార్, చెర్రీ కాంబోలో సినిమా సెట్స్‌ ఫైకి వస్తుంది. అయితే వీరిద్దరి కాంబోలో గతంలోనే బ్లాక్ బ‌స్టర్ రికార్డ్ ఉండటంతో ఈ సినిమా పుష్పా సిరీస్‌ల‌ను మించిన బ్లాక్ బస్టర్ అవుతుందని అంతా భావిస్తున్నారు.