ప్రశాంత్ నీల్ కాకుండా సలార్ ని ఎవరు తీసిన సినిమా ఆడేది కాదు.. స్టార్ యాక్టర్ సెన్సేషనల్ కామెంట్స్..

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా మూవీ సలార్. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజైరూ. 700 కోట్లకు పైగా గ్రాస్ వ‌శుళ‌ను కొల్లగొట్టి ప్రభాస్‌కు భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చింది. ఫ్యాన్స్ కు ప్రభాస్ సక్సెస్ దాహాన్ని తీర్చిన ఈ సినిమా.. రెండు పార్ట్‌టలుగా రిలీజ్ కానుంది. దీని రెండో భాగం కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక గతంలో కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ సిరీస్‌ల‌కు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సినిమాలో ప్రభాస్‌ను చూపించిన విధానం, స్క్రీన్ ప్లేతో చేసిన మ్యాజిక్ మైండ్ బ్లోయింగ్ గా ఉందని చెప్పాలి.

Paruchuri Gopala Krishna Talks About Sr NTR Social Movies | పోస్టర్‌లో  ఎన్టీఆర్‌ను అలా చూసి, ఆ సినిమా చూడకూడదు అనుకున్నారు: పరుచూరి గోపాలకృష్ణ

ఇక తాజాగా సలార్ థియేటర్స్ సంద‌డి ముగిసి ఓటీటీలోకి రిలీజ్ అయింది. దీంతో సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ మూవీ పై ఆసక్తికరమైన రివ్యూ అందజేశారు. సలార్ మూవీలో యాక్షన్, జానపదం, పౌరాణిక, సాంఘిక ఇలా అన్ని అంశాలు కలిశాయని.. పౌరాణిక గెటప్లు మాత్రమే కనిపించలేదని వివరించాడు. కొన్ని సన్నివేశాల్లో ఇత‌ర‌హగా కూడా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే సలార్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ తప్ప ఇంకెవరు తెర‌కెక్కించిన ఆడేది కాదని కామెంట్ చేశారు. వేరే దర్శకుడు ఈ కథతో సినిమా చేస్తే ఆడుతుందా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అంటూ వివరించాడు.

Salaar: Part 1 – Ceasefire Telugu Movie Review

తొలి 30 నిమిషాలు ప్రభాస్ డైలాగ్ లేకపోవడం ఆశ్చర్యంగా అనిపించిందని.. ఈ సినిమాలో చూపించిన కాన్సర్ అనే ప్రాంతం హిస్టరీ తో మిక్స్ చేస్తూ నమ్మదగినట్లుగా ప్రశాంత్ నీల్ చూపించాడని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉందని.. కళ్ళు చెదిరే విధంగా ఫైట్ సీన్స్ ను తెరకెక్కించాడని.. సలార్ పార్ట్ 2 కోసం ఈ సినిమాలో చాలా సస్పెన్స్ ఉంచాడని.. చాలా విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది అంటూ వివరించాడు. అవన్నీ పార్ట్‌2లో చూపిస్తారేమో అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.