రష్మిక డీప్ ఫేక్ వీడియో చేసిన యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతని వివరాలు ఇవే..!

గత కొంతకాలంగా రష్మిక డీప్ ఫేక్ వీడియో గురించి సోషల్ మీడియాలో నెట్టింట చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రష్మిక సైతం చాలా ఎఫెక్ట్ అయింది. ఈమెకి సపోర్ట్ గా పలువురు సినీ సెలబ్రిటీలు సైతం నిలిచారు. ఇక దీని ఒరిజినల్ వీడియోని పట్టుకున్నారు పోలీసులు.

కొందరిని అరెస్ట్ చేసినప్పటికీ అసలు నిందితుడిని మాత్రం అప్పుడు అరెస్ట్ చేయలేదు. ఇక ప్రస్తుతం ఆ యువకుడు దొరికినట్లు సమాచారం అందుతుంది. ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్న ఢిల్లీ పోలీసులు రష్మిక డీప్ ఫేక్ వీడియో పై తీవ్ర చర్యలు తీసుకున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఓ వ్యక్తి ఈ డీప్ ఫేక్ వీడియోని తయారు చేశాడట. ఇక ప్రస్తుతం అతనిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇక ఇతనపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.