మామ కృష్ణ కారణంగా ఆ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకున్న నమ్రత.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతకు తెలుగు ప్రేక్షకులో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతంలో బాలీవుడ్ స్టార్ బ్యూటీగా ఓ వెలుగు వెలిగిన నమ్రత.. టాలీవుడ్ లో కూడా అంజి, వంశీ లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈమె నటించిన సినిమాలు ఏవి ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. కానీ ఈమెకు ఉన్న మిస్ వరల్డ్ కిరీటంతో భారీ పాపులారిటీ వచ్చింది. ఈ క్రేజ్‌ తోనే ఈమె నటించిన సినిమాలు ఫ్లాప్ అయినా కూడా.. వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఓ బ్లాక్ బస్టర్ మూవీ లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ వచ్చినా నమ్రత మిస్ చేసుకుందట.

దానికి కారణం ఆమె మామయ్య కృష్ణ అనే న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ మూవీ ఏంటి అనుకుంటున్నారా.. అదే మహేష్ బాబు హీరోగా నటించిన ఒక్కడు. మహేష్ బాబు భూమిక కాంబినేషన్‌లో వ‌చ్చిన‌ ఈ సినిమా టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమా రూ.14 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కి 30 కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టింది. మహేష్ బాబు వన్ ఆఫ్ ది హిట్ మూవీస్ లో ఇది కూడా ఒకటి. అయితే ఈ సినిమా చేసే టైం కి మహేష్, నమ్రత ఒకరితో ఒకరు ప్రేమలో ఉన్నారట.

ఈ కారణంగా నమ్రతని సినిమాలో హీరోయిన్గా పెట్టమని మహేష్ స‌జెస్ట్ చేశాడట. డైరెక్టర్ గుణశేఖర్ కూడా దీనికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారట. ఈ విషయాన్ని కృష్ణ తెలుసుకొని అవసరం లేదు అంటూ నమ్రతను రిజెక్ట్ చేశాడట. ఎందుకంటే మహేష్, నమ్ర‌త‌లు అప్ప‌టికే ల‌వ్‌లో ఉన్న సంగతి ఆయనకు కూడా తెలుసు. ఈ సినిమా మళ్లీ కలిసిన నటిస్తే వీరిద్దరి మధ్యన బాండింగ్ మరింత పెరుగుతుందనే ఉద్దేశంతో కృష్ణ ఈ సినిమాలో నామ్రతను వద్దని చెప్పేసాడట. ప్రస్తుతం ఈ న్యూస్‌ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.