జిమ్ లో వర్క్ అవుట్లు చేస్తూ కుర్రాళ‌లో హీట్ పెంచేస్తున్న మృణాల్‌ ఠాగూర్..

సీతారామమ్‌ మూవీ తో టాలీవుడ్ కి అడుగుపెట్టిన మృణాల్ ఠాగూర్ మొదటి సినిమాతోనే బ్లాక్ బ‌స్టర్ ఖాతాలో వేసుకుని.. ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో ప్రిన్సెస్ నూర్జహాన్ గా, సీతా మహాలక్ష్మి గా రెండు పాత్రలోను ప్రేక్షకులను సాంప్రదాయ బద్ధంగా మెప్పించిన ఈమె కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. దీంతో మృణాల్‌కు టాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కుతున్నాయి. ఇప్పటికే నాని హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మృణాల్‌.. తన నెక్స్ట్ ప్రాజెక్టులో బిజీగా ఉంటుంది.

ఈ క్రమంలో మృణాల్ ఠాగూర్ టైం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. ఇంట్రెస్టింగ్ పోస్ట్లను షేర్ చేస్తుంది. అయితే మృణాల్ ఠాగూర్ ఎప్పుడు అందంగా ఫీట్ గా కనిపించడానికి ఎన్నో కసరత్తులు చేస్తూ కష్టపడుతూ ఉంటుంది.

తాజాగా ఆమె ఫిట్నెస్ కోసం జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న పిక్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తూ మైండ్ బ్లాక్ ఫోజులతో కుర్రాళ‌లో హీట్ పెంచేస్తోంది మృణాల్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో లైకులు, కామెంట్లతో వీడియోను మరింత వైరల్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం మృణాల్.. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తోంది.