చిరంజీవి కూడా ఆ క్యాటగిరికి చెందిన వాడే.. అందం కోసం అలా చేశాడా..?

సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి స్పెషల్ క్రేజీ స్థానం ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి అంటే నమ్మకానికి నిజాయితీకి మరో మారుపేరు అంటూ చెప్పుకొస్తూ ఉంటారు . కాగా అలాంటి మెగాస్టార్ కూడా అందం కోసం ఒక సర్జరీ చేయించుకున్నాడు అన్న రూమర్ అప్పట్లో సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేసింది. ఎస్ చిరంజీవి కూడా తన అందం కోసం సర్జరీ చేయించుకున్నాడట .

సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో చిరంజీవి అందం గురించి పెద్దగా ఆలోచించేవాడు కాదట . కానీ రాను రాను ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఎక్కువైపోవడం కొత్త హీరోలు ఆయనకు కాంపిటీషన్ ఇస్తూ ఉండడంతో మెగాస్టార్ చిరంజీవి పై పలు నెగిటివ్ కామెంట్స్ వచ్చాయట . మెగాస్టార్ చిరంజీవి ముక్కు వంకరగా ఉందని.. ఆయనకు ఆయన ముక్కే డిజాస్టర్ అని పలువురు ట్రోల్ చేశారట .

దీంతో కొన్నాళ్లపాటు ఆ కామెంట్స్ ని బాగా లైట్ గా తీసుకున్న చిరంజీవి .. ఆ తర్వాత ఆ కామెంట్స్ ఎక్కువైపోతూ ఉండడంతో చిరంజీవి సర్జరీ చేయించుకున్నారట . ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఇది అబద్ధం అని చిరంజీవి ఎలాంటి సర్జరీ చేయించుకోలేదు అని అంటున్నారు మెగా అభిమానులు..!!