టంగ్ స్లిపై లవర్ పేరు బయట పెట్టిన జాన్వీ కపూర్.. ఫ్లోలో అడ్డంగా దొరికిపోయిందే..

బాలీవుడ్ బ్యూటీ శ్రీదేవి ముద్దుల కూతురు జాన్మీకపూర్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీగా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో తన మార్క్‌ చూపించింది. ప్రస్తుతం కొరటాల శివ కాంబినేషన్లో తెర‌కెకుతున్న పాన్ ఇండియా మూవీ దేవరలో ఎన్టీఆర్ సరసన నటించబోతుంది. ఇక ఈమె గత కొంతకాలంగా తన స్నేహితుడితో ప్రేమలో ఉందంటూ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో ప్రేమలో ఉందంటూ వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. అంతేకాదు అతనితో కలిసి పార్టీలు పబ్‌లే కాకుండా కాస్త డిఫరెంట్గా దైవదర్శనాలను కూడా చేసుకుంటుంది.

ఇప్ప‌టికే ఎన్నోసార్లు కెమెరాలకు చిక్కింది. ఇద్దరు కలిసి పలుమార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక ఈ మధ్యన జాన్వి ఎక్కడ కనిపించినా అతనితో జంటగానే కనిపిస్తుంది. దీంతో ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే వీరిద్దరు మాత్రం వీరి రిలేషన్షిప్ గురించి ఎప్పుడూ బయట పెట్టలేదు. ఇద్దరు కలిసి తిరుగుతున్న కానీ మేము లవర్స్ అని మాత్రం ఒప్పుకోరు. తాజాగా నోరు జారి అసలు విషయం చెప్పేసింది జాన్వి. అయితే ఆమెను కన్ఫ్యూజ్ చేసి అసలు విషయాన్నీ రాబట్టింది మాత్రం బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కర‌ణ్‌ జోహార్ అనే చెప్పుకోవాలి.

జాన్వి కపూర్ తన చెల్లెలు ఖుషి కపూర్ తో కలిసి ఇటీవల కాఫీ విత్ కరణ్ షోకు హాజరయింది. ఇందులో ఈ అక్క, చెల్లి ఇద్దరు తెగ అల్లరి చేశారు. ఇద్దరు కలిసి కరణ్‌ను ఆటపట్టించారు కూడా. అయితే షో మంచి రస‌వ‌త్త‌రంగా సాగుతున్న సమయంలో సడన్గా జాన్విని కన్ఫ్యూజ్ చేసి కరణ్ ఓ ప్రశ్న అడిగాడు. నీ స్పీడ్ డయల్ లిస్ట్ లో ఉన్న ముగ్గురి పేర్లు చెప్పు అంటూ ప్రశ్నించాడు. దానికి జాన్వి బదిలీస్తూ పప్పా, ఖుషు, షికు అంటూ చెప్పుకొచ్చింది. అయితే పప్పా, ఖుషు అంటే తన తండ్రి, చెల్లెలు పేర్లు అన్న విషయం అందరికీ తెలుసు. ఇక మూడో పేరు శిఖర్ ప‌హారియాది అని తెలుస్తుంది. శిఖర్ పేరుని షికూ అని ఫాస్ట్ డైల్‌ లిస్టులో సేవ్ చేసుకున్నట్లు అందరికీ తెలిసిపోయింది.

అయితే ఏదో కన్ఫ్యూజన్‌లో అతడి పేరు చెప్పేసింది గాని తర్వాత ఆమె ఎక్స్ప్రెషన్స్ లో అయ్యో చెప్పేసాను అన్నట్లు ఫేస్‌లో కనిపించాయి. ఇక కరణ్ జోహార్ జాన్వితో ఎలాగైనా ఆన్సర్ చెప్పించేశాను అన్న ఆనందంతో నవ్వుతూ ఎగురుతూ గంతులేసాడు. ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఈ ఎపిసోడ్ పై ప్రేక్షకుల ఆసక్తి పెరిగింది. తన ప్రియుడి గురించి ఇంకా ఏమైనా ఆసక్తి క‌ర విషయాలు షేర్ చేసుకుందేమో కచ్చితంగా దీనిని మిస్ అవ్వకూడదు అన్న ఇంట్రెస్ట్ ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ఈమె ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ తో నటిస్తున్న దేవర ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకి రానుంది. అదేవిధంగా సౌత్ లో మరిన్ని సినిమా అవకాశాలు ఆమెకు వచ్చాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి.