ఆ షోలో అందరి ముందు స్టార్ట్ డైరెక్టర్ ను తిట్టిన మోహన్ బాబు.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్‌గా తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకున్నాడు మంచు మోహన్ బాబు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 40 ఏళ్ళు అవుతున్నా.. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ సందడి చేస్తున్న మోహన్ బాబు.. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఎక్కువగా దాసరి నారాయణరావు గారి సినిమాల్లోనే కనిపిస్తూ ఉండేవాడు. ఒక రకంగా చెప్పాలంటే మోహన్ బాబుకి లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ దాసరి అనే చెప్పాలి. మోహన్ బాబుని విలన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆయ‌నే. అలాంటి క్యారెక్టర్లలోని నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మోహన్ బాబు.. కామెడీ విలన్ గా క్రెజ్ సంపాదించుకున్నాడు.

తన లాంటి నటనని ఎవరూ చేయలేరు అనంత గొప్పగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో హీరోగా మారి మంచి సినిమాలను తీస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే గతంలో మోహన్ బాబు.. రాఘవేందర్రావు హోస్ట్ గా వ్యవహరించిన సౌందర్యలహరి అనే ప్రోగ్రాంలో సందడి చేసిన సంగతి తెలిసిందే. రాఘవేంద్రరావు ఈ షోలో తను ఎవరితో అయితే సినిమాలు చేశాడో వాళ్ళని పిలిచి వాళ్ళ సినిమాకు సంబంధించిన డిస్కషన్ చేస్తూ ఉండేవాడు. అలానే ఒకరోజు మోహన్ బాబును గెస్ట్ గా పిలిచాడు. మోహన్ బాబుతో పాటు దర్శకులు కోదండరామిరెడ్డి, బి.గోపాల్ కూడా హాజరయ్యారు.

ఆయనతో సినిమాలు తీసిన న‌టులు మాత్రమే వస్తారు కదా.. మరి డైరెక్టర్లు రావడం ఏంటి అని అంతా అనుకోవచ్చు.. అయితే కోదండరామిరెడ్డి, బి గోపాల్.. రాఘవేందర్ రావు దగ్గర అసిస్టెంట్లుగా వ్యవహరించారు. దీంతో ఆయన షోకు వీరు కూడా వ‌చ్చారు. ఇక ఈ షోలో మోహన్ బాబు కోదండరామిరెడ్డి గురించి మాట్లాడుతూ.. వీడు నాతో సినిమా చేయమంటే అసలు చేయట్లేదు.. వీడికి పొగరు బాగా ఎక్కువగా ఉంటుంది అంటూ కోదండరామిరెడ్డి పై ఫైర్ అయ్యాడు. అప్పుడు కోదండరామిరెడ్డి స్పందిస్తూ నేను అప్పుడు వేరే సినిమాల్లో బిజీగా ఉన్నాను.. అందువల్ల నీతో సినిమా చేయలేకపోయాను అంటూ వివరించాడు.

అయినా మోహన్ బాబు మాత్రం ఒప్పుకోకుబ‌డా అలా చేయడం నీ తప్పని ఒప్పుకోవాలి అంటూ అతని చేత తప్పని ఒప్పించి తర్వాతే కూల్ అయ్యాడు. ఈ షోను చూసిన ప్రేక్షకులంతా మోహన్ బాబు ఎందుకు అంతలా ఆయన పై విరుచుకుపడ్డాడు.. అలా బిహేవ్ చేయడం అవసరమా అంటూ విమర్శించారు. మోహన్ బాబు కేవలం ఆ ఒక షోలోనే కాదు.. ఏ షోలో హాజరైన కచ్చితంగా ఆయనకు న‌చ్చ‌ని ప్రశ్న ఎదురైతే అలాగే వారిపై విరుచుకుపడుతూ కోపాన్ని చూపిస్తూ ఉంటాడు. దీని కారణంగా ఇప్పటికే మోహన్ బాబు ఎన్నోసార్లు విమర్శలకు లోనయ్యారు.