బాలయ్య ఏమో అలా ..ఎన్టీఆర్ ఏమో ఇలా..మధ్యలో నలిగిపోతున్న మోక్షజ్ఞ .. నెక్స్ట్ ఏంటి..?

సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ – బాలయ్య పేర్లు ఎలా ట్రోల్ అయ్యాయో మనం చూసాం. ఎన్టీఆర్ అభిమానులు బాలయ్య ని ట్రోల్ చేస్తే .. బాలయ్య అభిమానులు ఎన్టీఆర్ను ట్రోల్ చేశారు . సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాతు చేసిన ఫ్లెక్సీలను బాలయ్య తీసేయమని చెప్పడం.. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం పెద్ద దుమారమే రేగింది .

దీనిపై ఎన్టీఆర్ – బాలయ్య అభిమానులు ఓ రేంజ్ లో ట్విట్టర్లో రెచ్చిపోయి మాటలు యుద్ధం చేసుకున్నారు . అయితే ఇప్పుడు ఆ మాటలు యుద్ధం కాస్త మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై పడింది . బాలయ్య కొడుకు మోక్షజ్ఞ త్వరలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు . అయితే బాలయ్య ఎన్టీఆర్ ని తొక్కాడానికి ట్రై చేస్తున్నాడు అని.. నందమూరి ట్యాగ్ ఇవ్వట్లేదు అని .. పలువురు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు .

ఇదే క్రమంలో మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీ లోకి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో చూస్తాము అని .. అతడి సినిమాలు హిట్ అవ్వకుండా చేస్తాము అని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హెచ్చరిస్తున్నారట .ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఇది ఎన్ టీఆర్ అభిమానులు చేస్తున్న కామెంట్స్ కావు అని.. కావాలనే కొందరు ఇలా ఆయన పై బురద చల్లడానికి చేస్తున్నారు అని తారక్ ఫ్యాన్స్ క్లారిటీ ఇస్తున్నారు..!!