“తూచ్ నేను అలా అనలేదు”.. కొత్త మలుపు తిరిగిన NTR ఫ్లెక్సీల వివాదం..!

మనకు తెలిసిందే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నిన్న బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నందమూరి కుటుంబ సభ్యులు సీనియర్ ఎన్టీఆర్ సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. అయితే అక్కడ జరిగిన ఒక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. బాలకృష్ణ అక్కడి నుంచి వెళ్లి వెళ్ళగానే ఎన్టీఆర్ కళ్యాణ్రామ్ కి సంబంధించిన ఫోటోలు కొన్ని అక్కడ నుంచి తీసేశారు.

దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు . అంతేకాదు బాలకృష్ణ చెప్తేనే ఆ విధంగా చేశారు అక్కడ ఉండే కార్యకర్తలు అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. అయితే దీనిపై రీసెంట్గా మరో క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియాలో మరో న్యూస్ వైరల్ అవుతుంది. బాలకృష్ణ ఫ్లెక్సీలను తొలగించమనింది జూనియర్ ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ ఫోటోలు ఉన్నందుకు కాదు అని ..

అక్కడ స్వాగతం – సుస్వాగతం అని ఫ్లెక్సీలో రాసి ఉన్నారు అని .. ఇలాంటి వాటికి అలా స్వాగతం – సుస్వాగతం అని రాయకూడదు అని ఆ కారణంగానే బాలకృష్ణ ఆ ఫ్లెక్సీలను తీసేయమన్నారు అని ..కావాలనే కొందరు ఇలా పుకార్లు పుట్టించి బాలకృష్ణపై నిందలు వేస్తున్నారు అని ..నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఈ ఇష్యూ బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అసలు బాలకృష్ణ నిజంగానే అలా అన్నాడో..? లేదో..? తెలియదు కానీ ఈ వార్త మాత్రం తెగ వైరల్ అయిపోతుంది..!!