గుంటూరు కారం సెకండ్ డే కలెక్షన్స్.. మహేష్ కెరియర్ లోనే చెత్త రికార్డ్..!

గుంటూరు కారం .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇదే పేరు మారు మ్రోగిపోతుంది . టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమానే ఈ గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ అయింది .

మొదటి రోజు బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ టాక్ దక్కించుకుంది. ఆ తర్వాత సినిమాకి అంత సీన్ లేదు అంటూ ప్లాప్ అంటూ జనాలు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించిన గుంటూరు కారం సెకండ్ డే బాక్సాఫీస్ వద్ద తుస్సు మంటూ బోల్తా కొట్టింది . కేవలం 9 అంటే 9 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. దీనితో మహేష్ బాబు కెరియర్ లో ఇది ఓ చెత్త రికార్డుగా నిలిచిపోయింది.

ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల , మీనాక్షి చౌదరీలు హీరోయిన్లుగా నటించారు . తల్లి పాత్రలో రమ్యకృష్ణ తాత పాత్రలో ప్రకాష్ రాజ్ అద్భుతమైన నటన కనబరిచారు . ఈ సినిమా అంతా బాగున్నప్పటికీ సినిమా మొత్తం పాత చింతకాయ పచ్చడి లానే ఉంది అన్న కామెంట్స్ రావడంతో సినిమా కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి..!!