” మాల్దీవులకు టికెట్లు తీసి క్యాన్సిల్ చేశా.. ఎందుకంటే వాళ్లు ప్రవర్తించిన బిహేవియర్ నాకు నచ్చలేదు “.. నాగ్ సెన్సేషనల్ కామెంట్స్..!

అక్కినేని నాగార్జున హీరోగా నటించిన తాజా మూవీ ” నా సామి రంగ “. ఎన్నో అంచనాలపై రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో చూడాలి మరి. విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో ఆషిక రంగనాథ్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. అలాగే అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలలు పోషించారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మాల్దీవులకు తాను టికెట్లను బుక్ చేసుకుని క్యాన్సిల్ చేశానని నాగ్ చెప్పుకొచ్చాడు. నాగార్జున మాట్లాడుతూ..” బిగ్ బాస్ షో, నా సామి రంగ షూటింగ్ కోసం 75 రోజులపాటు విశ్రాంతి లేకుండా పని చేశాను. నా సామి రంగ మూవీ రిలీజ్ తరువాత నేను రిలాక్స్ అవ్వాలనుకున్న.

15వ తేదీన మాల్దీవులకు వెళ్లాలని టికెట్లు బుక్ చేసుకున్న. కానీ ఈ మధ్య టిక్కెట్లు అన్ని క్యాన్సిల్ చేశా. గతంలో నేను చాలా సార్లు మాల్దీవులకు వెళ్లాను. అయితే ఎవరో ఏదో అన్నారని భయపడి మాల్దీవులకు టికెట్లు రద్దు చేయలేదు. మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు నచ్చకపోవడం వల్లే ఇలా చేశాను ” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాగార్జున వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.