షోయబ్ నుండి విడాకులు తీసుకున్న సానియా మీర్జా .. భరణం కింద ఎంత డిమాండ్ చేసిందో తెలుసా..?

మనకు తెలిసిందే.. టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా రీసెంట్గా విడాకులు తీసుకున్నారు. పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సానియా మీర్జా రీసెంట్ గానే ఆయన నుంచి విడాకులు తీసుకున్నారు . దీనికి సంబంధించి సానియా మీర్జా తండ్రి అఫీషియల్ ప్రకటన కూడా చేశాడు . అంతేకాదు సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ మూడో పెళ్లి కూడా చేసేసుకున్నాడు . పాకిస్తాన్ నటి సనా జావేద్ను షోయబ్ మాలిక్ పెళ్లి చేసుకున్న పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా విడాకుల తీసుకున్న సానియా మీర్జా -షోయబ్ మాలిక్ నుంచి ఒక్క రూపాయి కూడా భరణం తీసుకోలేదు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సాధారణంగా విడాకులు తీసుకున్న తర్వాత భార్య.. భర్త నుంచి కొంత భరణం డిమాండ్ చేస్తుంది . అయితే సానియా మీర్జా మాత్రం ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు అంటూ విడాకుల పేపర్లపై సైన్ చేసిందట.

దీంతో సానియా మీర్జా అభిమానులు ఆమెను పొగిడేస్తున్నారు . దటీజ్ ఇండియన్ గర్ల్ పవర్ అంటూ ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. కాగా సానియా మీర్జాకు ఒక టాలీవుడ్ హీరో తో ఎఫైర్ ఉందని ఆ కారణంగానే వీళ్ళు విడాకులు తీసుకున్నారు అని కొత్త ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!