నమ్రత బర్తడే స్పెషల్: అలాంటి పని చేసిన మహేష్ బాబు.. కెరీర్లో ఫస్ట్ టైం ఇలా..ప్రేమంటే ఇదేగా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పుట్టిన రోజు నేడు . ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన పలు ఫోటోలను వీడియోలను ట్రెండ్ చేస్తున్నారు నమ్రత శిరోద్కర్ అభిమానులు. ఈ క్రమంలోనే మహేష్ బాబు ఆమెకు స్పెషల్గా బర్త్డ డే విషెస్ అందించారు. నిజానికి ఎప్పుడు కూడా నమ్రత బర్త డే ను చాలా గ్రాండ్గా స్పెషల్ గా సెలబ్రేట్ చేసేవాడు మహేష్ బాబు .

అయితే ఈసారి ఆయన కొన్ని పనులు కారణంగా జర్మనీ వెళ్లిపోవడంతో నమ్రత బర్త డే ను సెలబ్రేట్ చేయలేకపోయాడు . నమ్రత ఇండియాలో ఉంది. మహేష్ బాబు జర్మనీలో ఉన్నాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా నమ్రతకు బర్తడే విషెస్ అందించాడు మహేష్ బాబు . కెరియర్ లో ఫస్ట్ టైం ఇలా దూరం దూరంగా బర్తడే జరుపుకున్నారు మహేష్ బాబు – నమ్రత.

రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో హిట్ అందుకున్న మహేష్ బాబు త్వరలోనే రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అవుతున్నాడు. కాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట చాలా హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. మహేశ్ బాబు కి తన భార్య నమ్రత అంటే చాలా చాలా ఇష్టం..!!