పవన్ కళ్యాణ్ నటించిన ఆ సినిమాను కమల్ హాసన్ ఏకంగా వందసార్లు చూశాడా.. అంతలా నచ్చిందా..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో రిలీజ్ అవుతుంది అంటే చాలు ఫ్యాన్స్ లో ఆనందం మామూలుగా ఉండదు. థియేటర్స్ వద్ద రచ్చ రచ్చ చేస్తూ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం రాజకీయాల పరంగా బిజీగా ఉంటున్న పవన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఇటీవల పవన్ నటించిన సినిమాలు మిక్స్డ్ టాక్ సంపాదించుకున్న గతంలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలంటే ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. అభిమానులు ఆయన సినిమాల కోసం చెవి కోసుకునేవారు.

పవన్ కళ్యాణ్ నటించినవి అతి తక్కువ సినిమాలైనా ఈ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే ఆయన ఎలాంటి కంటెంట్ నటించేవారు అర్థం చేసుకోవచ్చు. అయితే ఈయన సినిమాలకు సాధార‌ణ ప్రేక్ష‌కులే కాదు కాదు చాలామంది సెలబ్రిటీస్ కూడా అభిమానులే. ఇప్పటికి పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమాకు ఎంతోమంది సినీ సెలబ్రిటీస్ అభిమానులుగా మారిపోయారని చెప్పాలి. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబచ్చన్ అక్కడ ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో బిజీగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయనకు విరామం దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్ సినిమాలనే చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారట. ఈ విషయాన్ని తొలిప్రేమ మూవీ డైరెక్టర్ ఎన్నో సందర్భాల్లో వివరించాడు.

అదేవిధంగా మరో స్టార్ హీరో కమల్ హాసన్ కూడా పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా అంటే చాలా ఇష్టమని.. ఆయన కుమార్తె శృతిహాసన్ ఓ నేపద్యంలో చెప్పుకొచ్చింది. ఇటీవల రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు శృతిహాసన్. ఇందులో ఆమె మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సినిమాలంటే మా నాన్నకు ఎంతో ఇష్టమని.. ఇప్పటికి ఆయన నటించిన తొలిప్రేమ సినిమాను దాదాపు 100 సార్ల వరకు చూసి ఉంటారని చెప్పుకొచ్చింది. శృతిహాసన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. పవన్ కళ్యాణ్ సినిమాకు ఏ రేంజ్ లో సెలబ్రిటీస్ అభిమానులు ఉన్నారో అర్థమవుతుంది.