“బంధం ముక్కలైంది”.. సానీయా మీర్జా సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ ఎక్కువగా విడాకులు తీసుకుంటున్న విషయాలను మనం వింటున్నాం . అయితే రీసెంట్ గా స్టార్ ప్లేయర్స్ కూడా విడాకులు తీసుకోవడం అలవాటుగా మారిపోయింది . ఇప్పటికే ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు విడాకులు తీసుకున్నారు . తాజాగా అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతుంది భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా అంటూ న్యూస్ వైరల్ అవుతుంది .

గత కొంతకాలంగా సానియా మీర్జా కి షోయబ్ మాలిక్ క్య్ సంబంధించిన విడాకుల న్యూస్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతుంది . సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సానియా మీర్జా తన విడాకులపై హింట్ ఇచ్చేసింది అన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి . సానియా మీర్జా -షోయబ్ మాలిక్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

కొన్నాళ్లు బాగానే సాగిన వాళ్ల కాపురం ఇప్పుడు మనస్పర్ధలతో ముగిసిపోతుంది . రీసెంట్ గా సానియా మీర్జా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ” పెళ్లి కష్టం విడాకులు కూడా కష్టమే మీరు కఠినంగా ఉండి ఎంచుకోండి ..లావుగా ఉండడం కష్టమే అలా అని ఫిట్ గా ఉండడం కూడా కష్టమే.. అప్పు ఉండడం ఎంత కష్టమో ఆర్థిక క్రమశిక్షణ పాటించడం కూడా అంతే కష్టం. ఏదైనా సరే మీరు కఠినంగా ఉంచి ఎంచుకోండి ..ఇతరులతో కలిసి మెలిసి మాట్లాడడం కష్టం .. ఏ సమాచారం లేకుండా ఉండడం కూడా కష్టమే జీవితం అనేది అంత సులభం కాదు అది ఎప్పటికీ కష్టమే కానీ మనం ఎప్పుడు మన కష్టాన్ని మనం ఎంచుకోవాలి” అంటూ భారీ కొటేషన్లు రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ విడాకుల అంశాన్ని తెరపైకి తెచ్చేలా చేసింది..!