ట్రెండీ వేర్ లో దర్శనమిచ్చిన యాంకర్ సుమ.. భర్త రాజీవ్ షాకింగ్ రియాక్షన్.. (వీడియో)

టాలీవుడ్ స్టార్ యాంకర్ అనగానే టక్కున గుర్తుకు వచ్చేది సుమ. ఇండస్ట్రీలో టాప్ ఫిమేల్ యాంకర్ గా చెరగని ముద్ర వేసుకుంది. ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌, షోస్‌కు యాంకర్ గా సందడి చేసిన సుమ ఎప్పుడు ఫుల్ బిజీగా గడుపుతూ ఉంటుంది. అంతేకాదు అప్పుడప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటిస్తూ మెప్పించే ఈమె సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తనకు సంబంధించిన ఆసక్తికరమైన పోస్టులను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తుంది. ఇటీవల తన కొడుకు రోషన్ కనకాలను బబుల్ గమ్ సినిమాతో హీరోగా లాంచ్ చేసింది.

ఈ సినిమా థియేటర్లో రిలీజై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇటీవల సుమ తన కొడుకు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మోడరన్ లుక్స్ లో ఫోటో షూట్ చేసి సందడి చేసింది. జీన్స్, హోల్స్ టీషర్ట్ వేసి స్టైల్ గా కళ్ళజోడు పెట్టుకొని ఫోటోలు దిగింది. అయితే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. సుమలో ఆ యాంగిల్ కూడా ఉందా అంటూ అంతా షాక్ అయ్యారు. సుమ ఇన్స్టాల్ తాజాగా మరో పోస్ట్ ని షేర్ చేసుకుంది.

మోడల్ ఫోటో షూట్ జరుగుతున్నప్పుడు భర్త రాజీవ్‌ కలకాల రియాక్షన్ ఇదేనంటూ ట్యాగ్ చేసింది. అలాంటి డ్రెస్ లో సుమను చూసిన రాజీవ్‌.. వామ్మో, వాయ్యో, బాబోయ్ నేను చూడలేకపోతున్న ఈ ఘోరం అంటూ ప్రేక్షకులు నవ్వు తెప్పించే విధంగా రియాక్షన్స్ ఇచ్చాడు. అయితే ఈ వీడియోని చూసిన నెటిజ‌న్స్‌ భార్య ఇలా చేస్తే భర్తలు రియాక్షన్ ఇలానే ఉంటుంది అంటూ.. రాజీవ్ గారు ఆ పోట్ షూట్ టైంలో మీరు అక్క‌డే ఉన్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Suma Kanakala (@kanakalasuma)