సింగ‌ర్ సునీత ఫ‌స్ట్ భ‌ర్త ఎవ‌రు… ఎందుకు వదిలేసింది…!

టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె పాడే పాటలు వింటే చాలు ఈ జన్మకి అనిపిస్తుంది. అంత గొప్పగా ఉంటుంది ఈమె గానం. అలాగే ఈమె మాట్లాడినప్పుడు కూడా అది పాటల అనిపిస్తుంది ఎదుటివారికి. ఇక స్టార్ హీరోయిన్స్ కి డబ్బింగ్ చెబుతూ ప్రేక్షకుల మనసుల‌ని గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే ఈ గాయని జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది.

సింగర్ సునీత మొదటి భర్త గురించి పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. ఆమె మొదటి పెళ్లి సినిమా స్టైల్ లో జరిగింది. అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పుడు ఆమె వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. ఆమె మొదటి భర్త పేరు కిరణ్. ఆయన కూడా ఇండస్ట్రీకి చెందిన వాడే. ఈమె గాయని అయిన తర్వాత ఈమెని అందరూ ప్రశంసించడం మొదలుపెట్టారు.

ఇక ఈమెకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడే కిరణ్ ఐ లవ్ యు చెప్పాడట. దీనికి వెంటనే ఈమె నో చెప్పిందట. దాదాపు సంవత్సరం నర అయిన తరువాత ఓకే చెప్పిందట. అనంతరం వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక ఆ తర్వాత ఏవో మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం తన రెండవ భర్తతో ఎంజాయ్ చేస్తూ తన జీవితాన్ని గడిపేస్తుంది సునీత.