హీరో శివాజీ గురించి ఆ సీక్రెట్ రివీల్ చేసిన నటుడు సమీర్.. ఎవరు ఊహించి ఉండరు..

బిగ్‌బాస్‌ సీజన్ సెవెన్ ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ ద్వారా భారీ పాపులారిటీ ద‌క్కించ్చుకున్న కంటెస్టెంట్లలో హీరో శివాజీ ఒకరు. ఆయనకు ఇప్పటివరకు ఇద్దరు కొడుకులు ఉన్నారని మాత్రమే చాలామందికి తెలుసు. హౌస్ లో కూడా శివాజీ కేవలం అది మాత్రమే చెప్పారు. బిగ్ బాస్ హౌస్ లోకి శివాజీ పెద్ద కొడుకు డాక్టర్ గా వస్తే, భార్యతో చిన్న కొడుకు స్టేజ్ పైకి వచ్చి ప్రేక్షకులకు పరిచయమయ్యారు. కానీ శివాజీ కూతురు ప్రస్తావన‌ ఎక్కడా రాలేదు. అయితే ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన నటుడు స‌మీర్‌ మాట్లాడుతూ నాగార్జున తో జరిగిన ఒక క‌న్వర్జేషన్ లో శివాజీ కచ్చితంగా కరెక్ట్ అంటూ వివ‌రించాడు.

Bigg Boss Telugu makers need self-introspection after Sameer's elimination

మా ఇంట్లో ఇలాంటి ఆడపిల్ల ఉంటే పీక మీద కాలేసి తొక్కుతా అన్నారు. అయితే శివాజీకి కూడా ఒక కూతురు ఉంది. ఇద్దరు కొడుకులు కాకుండా ఆయనకు ఒక్క కుమార్తె ఉంది అంటూ అంటూ షాకింగ్ విష‌యాని బ‌య‌ట పుట్టాడు. ఇక స‌మీర్ మాట్లాడుతూ శివాజీ నిజంగానే పీక మీద కాలేసి తొక్కే వాడైతే ఇంట్లో వాళ్ళపై ఇలా చేసేవాడు.. పీక మీద కాలేసి తొక్కేయడం అంటే నిజంగానే తొక్కేస్తా అని కాదు.. ఆయనకు వచ్చిన కోపాన్ని అర్థం చేసుకోవాలి. శోభ‌శెట్టి ప్ర‌వ‌ర్త‌న‌కు కంట్రోల్ తప్పిన శివాజీ అలా అన్నారు అంతమాత్రాన నిజంగా తొక్కేస్తాడని కాదు. ఆయన కోపం ఏ స్థాయికి వెళ్తే అలాంటి మాట అంటాడు.. ఎంత పెద్ద టెలివిజన్ షోలో శివాజీ అలా అనడం కూడా తప్పే అంటూ సమీర్‌ చెప్పుకొచ్చాడు.

Bigg Boss 7: Sivaji cries in the confession room

అయినప్పటికీ అది నాకు జెన్యూన్ గా అనిపించింది. మన సైడ్ తప్పు లేనప్పుడు మనం మాట్లాడవచ్చు. ఆడపిల్లల్ని పట్టుకుని అలా అనొచ్చా అని ఆడియన్స్లో ఓ మ‌హిళ అడిగింది. అయితే మగ పిల్లలను తొక్కెయొచ్చ అంటూ శివాజీ అడిగారు. అది కరెక్టే కదా.. కానీ దానికి నాగార్జున శివాజీపై కోప్పడ్డారు నాగార్జునని తప్పు పట్టడానికి కూడా లేదు. ఆయన బిగ్ బాస్ హోస్ట్‌గా ఆ టీం చెప్పినట్లు చేయాలి అంటూ సమీర్ చెప్పుకొచ్చాడు. అయితే ఇంటర్వ్యూలో సమీర్ శివాజీకి కూతురు ఉంది అన్న విషయం షేర్ చేసుకోవడంతో ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది.