క‌రిష్మాను అభిషేక్ ఆ కార‌ణంతోనే పెళ్లి చేసుకోలేదా…!

బాలీవుడ్ లో బెస్ట్ కపుల్స్ గా పేరుపొందిన ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా కనిపిస్తారు. అయితే తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతుంది. ఇక దీనిపై ఇప్పటివరకు ఈ జంట ఏ విధంగా స్పందించలేదు. దీంతో అభిమానులు సైతం ఇది నిజమేనేమో అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే వీరి గురించి గత సమాచారాలు తొవ్వుతున్నారు. ఈ జంట 2007 ఏప్రిల్ 20వ తేదీన వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఓ కూతురు కూడా జన్మించింది.

ఇకపోతే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ ను వివాహం చేసుకునే ముందు కరిష్మాను వివాహం చేసుకోవాలనుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. అభిషేక్ బచ్చన్ కు 2002లో కరిష్మా కపూర్ తో నీర్చితార్థం జరిగిందని.. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారని.. కానీ కొన్ని కారణాల చేత కరిష్మా ఎక్కువగా జల్సాలకు తిరగడంతో బచ్చన్ కుటుంబం నుంచి బయట నివసించాలని కోరికతో అభిషేక్ బచ్చన్ కి ప్రెజర్ పెట్టడంతో తనను తన వివాహాన్ని సైతం రద్దు చేసుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే వివాహం అనంతరం అభిషేక్ బచ్చన్ కుటుంబంతో కాకుండా విడిగా జీవించాలని కరిష్మా అప్పట్లో ఓ కండిషన్ పెట్టిందట. ఇక తల్లిదండ్రులను ఎంతో ఇష్టంగా ప్రేమించే అభిషేక్ బచ్చన్ ఆ సమయంలో తన వివాహాన్ని సైతం తల్లిదండ్రుల కోసం త్యాగం చేశాడట. ఇక అనంతరం ఇదే కండిషన్ను ఐశ్వర్యరాయ్ కి కూడా పెట్టారట. అయితే ఐశ్వర్యరాయ్ ఈ కండిషన్ కి ఒప్పుకోవడంతో వీరిద్దరి వివాహం జరిగిందట. ఇలా ఈ ఓ కండిషన్ ద్వారా వీరిద్దరూ ఒకటయ్యారు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది.