మళ్లీ బేబీ రాబోతుందంటూ గుడ్ న్యూస్ షేర్ చేసిన ఉపాసన.. షాక్ లో అభిమానులు..?!

మెగా కోడలుగా భారీ పాపులార్టి దక్కించుకున్న ఉపాసనకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎంతో ఉన్నతమైన కుటుంబం నుంచి మెగా ఇంటికి కోడలు అడుగుపెట్టిన ఉపాసన ఎన్నో సామాజిక సేవ‌లు చేస్తు మెగా కుటుంబం పరువు ప్రతిష్టలకు భంగం కలగకుండా వ్యవహరిస్తూ ఉంటుంది. అలా తన ప్రవర్తనతో మెగా హీరోస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అదే రేంజ్‌లో మెగా కోడలుగా ఉపాసన సొంతం చేసుకుంది. ఈమె అపోలో హాస్పిటల్ చైర్మన్గా వ్యవహారాలను చూసుకుంటూ.. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటుంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా, మెగా కోడలిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఉపాసన ఇటీవల తల్లిగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఉపాసనల వివాహం జరిగిన 11 నెలలకు క్లీన్ కార కు జన్మనిచ్చారు. ఈ చిన్నారి జూన్ నెలలో జన్మించిన ఇప్పటివరకు ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు అయితే పెళ్లైన 11 సంవత్సరాలకు తమ అభిమాన హీరో తండ్రి కావడంతో మెగా ఫ్యాన్స్ అంతా ఆనందంలో మునిగితేలారు. ఇక క్లీన్ కార‌ ఫేస్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్‌.

ఇలాంటి క్రమంలో తాజాగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా మరో బేబీ కూడా రాబోతుంది అంటూ పోస్ట్ ను షేర్ చేసుకుంది. ఏంటి ఉపాసన మరో బేబీ రాబోతుంది అంటున్నారు.. కొంపదీసి మళ్లీ తల్లి అవుతుందా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. అయితే అసలు విషయం ఏంటంటే ఆమె పెద్దమ్మగా ప్రమోట్ అవుతుందని తెలుస్తుంది. ఉపాసనకు ఒక చెల్లి ఉన్న సంగతి తెలిసిందే. ఆమె పేరు అన్షుపాల. ఈమె గత మూడు సంవత్సరాల క్రితం అంగరంగ వైభవంగా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఉపాస‌న చెల్లి తల్లి కాబోతుందంటూ తెలుస్తుంది.

Inside Pictures Of Upasana Kamineni's Sister, Anushpala's ...

అన్షు సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోని ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ.. మై హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.. ఇంకా బేబీస్ రాబోతున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవడంతో ఉపాసన చెల్లెలకు అందరూ విషెస్ తెలియజేస్తున్నారు. కొంత మంది మాత్రం బేబీస్ అంటూ ఉపాసన షేర్ చేశారు.. ఈమెకు కవలలు పుట్టబోతున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవల ఉపాసన, రామ్‌చరణ్ దంపతులు ముంబైలో సందడి చేసిన సంగతి తెలిసిందే. అన్షుపాల సీమంతం వేడుకలు ముంబైలోనే జరిగాయని అందుకే అక్కడకు వెళ్లినట్లు తెలుస్తుంది.