ప్రభాస్ ” సలార్ ” విషయంలో వేణు స్వామి మాటలే నిజమయ్యాయిగా… ప్రభాస్ జాతకం ఇలాంటిదా…!!

ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ ద‌ర్శకత్వంలో తెరకెక్కనున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఈ సినిమా ఈనెల 22న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలోనే ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ క్రమంలోనే చిత్ర నిర్మాత విజయ్ కిరగందూర్. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ మూవీ విడుదలకు ఇదే కరెక్ట్ డేట్ అని ఎలా నిర్ణయించారని దానిపై క్లారిటీ ఇచ్చాడు. తాము కూడా జాతకాలు, ముహూర్తాలు నమ్ముతామని… అన్ని విషయాలను పరిగణంలోకి తీసుకుంటే ఈ తేదీన మూవీ రిలీజ్ చేయడం బెటర్ అనిపించిందని తెలిపారు.

ఇక ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రేక్షకులు.. ప్రభాస్ గురించి వేణు స్వామి చెప్పింది నిజమేనా?.. బాహుబలి తరువాత హీరో లైఫ్ లో అంత పెద్ద సక్సెస్ లేదని.. ఫ్యూచర్లో ఆయన సినిమాలను నిర్మించే నిర్మాతలు కూడా జాతకాలు చూపించుకోవాల్సి వస్తుందని తాజాగా వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు విజయ్ కిరగందూర్ ఇదే మాట అనడంతో… వేణు స్వామి చెప్పిందే నిజమని నమ్ముతున్నారు ప్రేక్షకులు.