ఆ స్టార్ హీరోని డైరెక్ట్ చేసే అవకాశాన్ని కొట్టేసిన త్రివిక్రమ్… అదృష్టమంతా నీ చుట్టూనే ఉందిగా…!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతి సినిమా కూడా పెద్ద విజయవంతం అయ్యిందనే చెప్పాలి. ఇక మోస్ట్ పాపులర్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఇక తాజాగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నా మూవీ ” గుంటూరు కారం “. మహేష్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అలాగే ఈ మూవీని హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇక ఈ మూవీ ని జనవరి 12న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నాడు. ఇక ఈ మూవీ అనంతరం ఇప్పటికే అల్లు అర్జున్ తో ఒక మూవీ ని కన్ఫర్మ్ చేసిన త్రివిక్రమ్.. ప్రస్తుతం మరో హీరోతో కూడా సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ హీరో మరెవరో కాదు నేచురల్ స్టార్ నాని. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. అనంతరం అట్లీతో ఓ మూవీ చేయనున్నాడట. ఇక ఈ క్రమంలోనే త్రివిక్రమ్ సైతం నాచురల్ స్టార్ నానితో ఓ సినిమా రూపొందించనున్నాడట. ఇక త్రివిక్రమ్ మొదట బన్నీతో సినిమా చేస్తాడా? లేదా నానితో చేస్తాడా? అనేది కన్ఫర్మ్ అయ్యేది మాత్రం గుంటూరు కారం రిలీజ్ అనంతరం. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.