నేపాల్ లో ప్రభాస్ రేంజ్ ఏంటో మరోసారి చూపిస్తున్న ఫ్యాన్స్… వీడియో వైరల్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ పార్ట్ 1″ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు మొదటి షో తోనే పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా రవి బస్రూర్ సంగీతం అందించాడు.

డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. వరుస రికార్డులను నెలకొల్పుతూ దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో… ఈశ్వరి రావు, జగపతిబాబు, పృధ్వీరాజ్ సుకుమారన్, శ్రియ రెడ్డి వంటి వారు కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ మూవీ భారీ విజయాన్ని సాధించడంతో మేకర్ప్‌ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అసలు మేటర్ ఏమిటంటే.. ప్రస్తుతం సలార్ మూవీ నేపాల్ లో ప్రదర్శితం అవుతున్న ఒక్క థియేటర్లో ప్రభాస్ మాస్క్రేస్ చూస్తే మతిపోతుంది.

దేవుడిని చూసేందుకు భక్తులు ఎదురుచూసినట్లుగా థియేటర్ల ముందు ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈలలు కేకలతో సలార్ టికెట్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూఉన్నారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన ప్రభాస్ అభిమానులు..” డార్లింగ్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.