మహేష్ ” గుంటూరు కారం ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ మీట్ ఎక్కడో తెలుసా…!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీని హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తుంది.

ఇక ఎస్ థమన్ సంగీత మందిస్తున్న ఈ మూవీలో జగపతిబాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, రఘుబాబు, సునీల్, బ్రహ్మానందం, హైపర్ ఆది కీలక పాత్రలలో నటిస్తున్నారు. జనవరి 12న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ ఆకట్టుకుని ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి.

ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్లో నిర్వహించేందుకు టీం సిద్ధమైందని.. అలాగే రిలీజ్ అనంతరం సక్సెస్ మీట్ ని గుంటూరు లో జరిపేందుకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వార్త పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.