బన్నీ ఫాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. అట్లీ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ యాక్షన్ అడ్వెంచర్స్ మూవీ..

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌కు ప్రత్యేకమైన పరిచ‌యం అవసరం లేదు. పుష్ప సినిమాతో ప్ర‌పంచవ్య‌ప్తంగా పాపులారిటీ దక్కించుకున్న ఈ యంగ్ హీరో.. ఈ మూవీతో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును కూడ దక్కించుకున్నాడు. దీంతో అల్లు అర్జున్ పేరు ప్రపంచం అంత మారుమోగిపోయింది. ఇక ప్రస్తుతం పుష్పాకు సీక్వల్ గా వస్తున్న పుష్పా 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు బన్నీ. అయితే ప్రస్తుతం బన్నీకి సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

జవాన్ తో బాలీవుడ్ రికార్డులను చెల్లాచెదురు చేసిన డైరెక్టర్ అట్లీ – బన్నీ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతుందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరి కాంబోలో సినిమా అంటే ఏ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే త్వరలోనే ఈ కాంబినేషన్ సెట్స్ పైకి రాబోతున్నట్లు సినీ వర్గాల సమాచారం. పుష్ప 2 తర్వాత.. బన్నీ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా నటిస్తున్నాడంటూ న్యూస్ వైర‌ల్ అయ్యింది.

అయితే ఆ సినిమా కాస్త ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉందట.. దీంతో ఈలోపు అట్లీతో సినిమా చేయడానికి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ అడ్వెంచర్స్ మూవీ ని వీలైనంత త్వరగా పూర్తిచేసి రిలీజ్ చేయాలని డైరెక్టర్ అట్లీ భావిస్తున్నాడట. ఇక మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నట్లు టాక్. ఈ మూవీకి సంభందించిన క్యాస్టింగ్‌, మరిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.