ఆ రేప్ సీన్ తో పోలిస్తే ఈ సీన్స్ నథింగ్.. ‘ యానిమల్ ‘ బ్యూటీ తృప్తి దిమ్రి సెన్సేషనల్ కామెంట్స్..

యానిమల్ మూవీలో రణ్‌బీర్ కపూర్ స‌ర‌సన నటించిన రష్మిక కంటే బోల్డ్ పాత్రలో నటించిన తృప్తి దిమ్రికి ఎక్కువ పాపులారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో రష్మిక నేషనల్ క్రష్ ట్యాగ్ తృప్తి దిమ్రి కొట్టేసింది. ఈ సినిమాలోకి ఇంటిమేట్‌ సన్నివేశాల్లో కూడా ఏమాత్రం భయం లేకుండా నటించిన ఈ బోల్డ్ బ్యూటీ.. అందం, అభినయం చూసి కుర్ర కారు తమ ఫేవరెట్ క్రష్ జాబితాలో ఈ మ్యూటీని యాడ్ చేసేసారు. తాజాగా ఈ బ్యూటీ యానిమల్ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. నేను నటించిన జోయా పాత్రకు ఇంత ఆదరణ వస్తుందని అసలు ఊహించలేద ని చెప్పుకొచ్చింది.

అయితే చాలామంది హీరో రణబీర్‌తో కలిసి నటించిన బెడ్ రూమ్‌ సీన్ గురించి మాట్లాడుతున్నారు. నిజానికి ఈ సీన్ కంటే కూడా బుల్ బుల్ మూవీ లో రేప్ సీన్ చాలా కష్టం. ఇది నేను నటిగా కాకుండా ఓ అమ్మాయిగా చెప్తున్నా. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో అంతా ఇచ్చేయడం అనేది చాలా కష్టం. దానితో పోలిస్తే యానిమల్‌లో నేను చేసింది నథింగ్ అంటూ చెప్పుకొచ్చింది. ఒక న‌టిగా నా పాత్రకు నేను న్యాయం చేయాలి.. ఈ మూవీకి ఆ సీన్ చాలా అవ‌స‌రం.. అలాంటప్పుడు బట్టలు తీసేసి ఆ సీన్ లో నటించిన తప్పు కాదని నా అభిప్రాయం అంటూ వివరించింది.

ఇక ఆరోజు సీన్‌ షూటింగ్ టైంలో కేవలం షూట్ లో నలుగురం మాత్రమే ఉన్నామని.. నేను, రణ్‌బీర్, డైరెక్టర్ సందీప్ రెడ్డి, కెమెరామెన్ తప్ప ఇంకా ఎవరు అక్కడ లేరని. ప్రతి ఐదు నిమిషాలకు నా గురించి వాళ్లు అడుగుతూనే ఉన్నారని వివరించింది. నువ్వు ఓకేనా.. కంఫర్ట్ గానే ఉన్నావా.. ఏదైనా ప్రాబ్లమా అంటూ తరచూ తెలుసుకున్నార‌ని.. వాళ్ళు ఆ సీన్స్ చేయడానికి నాకు చాలా సపోర్ట్ గా నిలిచారని.. అయినా రణ్‌బీర్‌తో సీన్‌ అంటే కాస్త కంగారు పడ్డానని.. అది అర్థం చేసుకున్న ఆయ‌న‌ చాలా బాగా మాట్లాడి నేను ఫ్రీ అయ్యేలా చేసాడని.. ముందు ఎవరి సీన్ కావాలంటే వారితో చేద్దాం అని స్వీట్ గా మాట్లాడి నా కంగారు పోగొట్టాడని వివరించింది.